Breaking News

వైజాగ్‌ నేవీ మారథాన్‌ విజేతలు శిఖంధర్, ఆశా

Published on Mon, 11/06/2023 - 04:29

విశాఖ స్పోర్ట్స్‌: విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన వైజాగ్‌ నేవీ మారథాన్‌ 8వ ఎడిషన్‌ ఓపెన్‌లో శిఖంధర్, మహిళల్లో ఆశా విజేతలుగా నిలిచారు. వైజాగ్‌ నేవీ మారథాన్‌ పరుగు సాగరతీరంలోని వైఎస్సార్‌ విగ్రహం నుంచి అథ్లెట్లు విజయమే లక్ష్యంగా ఫుల్‌ మారథాన్, హాఫ్‌ మారథాన్, 10 కిలోమీటర్ల పరుగుపెట్టారు. ఔత్సా­హికులు సరదాగా ఐదు కిలోమీటర్ల మేర ఫన్‌ రన్‌ చేపట్టారు. ఫుల్‌ మారథాన్‌ 42.2 కిలోమీటర్లు, హాఫ్‌ మారథాన్‌ 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల రేస్‌ను నిర్వ­హించి విజేతలకు బహుమతులందించారు.

మారథాన్‌ రేస్, ఫన్‌ పరుగు ఆర్‌కే బీచ్‌ మీదుగా నేవల్‌ కోస్టల్‌ బ్యాటరీ వైపు వద్ద యూటర్న్‌ తీసుకుని.. కాళీమాత ఆలయం మీదుగా వీఎంఆర్‌డీఏ ఎంజీఎం పార్క్‌ వద్దకు చేరుకోగానే ముగిసింది. పది కిలోమీటర్ల పరుగు తెన్నేటి వద్ద యూ టర్న్‌ తీసుకోగా, హాఫ్‌ మారథాన్‌ పరుగు వీరులు రుషికొండ గాయత్రి కళాశాల దగ్గర యూ టర్న్‌ తీసుకున్నారు. పూర్తి మారథాన్‌లో అథ్లెట్లు ఐఎన్‌ఎస్‌ కళింగ సమీపంలోని చేపాలుప్పాడ దగ్గర యూ టర్న్‌ తీసుకుని ప్రారంభస్థానానికి చేరుకున్నారు.

వీఎంఆర్డీఏ పార్క్‌లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పురుషుల ఓపెన్‌ హాఫ్‌ మారథాన్‌లో దీపక్‌ కుంబార్, 10 కిలోమీటర్ల పరుగులో సోనుకుష్వా విజేతలుగా నిలిచారు. మహిళా విభాగం హాఫ్‌ మారథాన్‌లో లిలియన్‌ రుట్టో, 10 కిలోమీటర్ల పరుగులో మేరీగ్రేస్‌ విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)