Breaking News

ఏంటి కోహ్లి ఇది.. నీ స్దాయికి ఇది త‌గునా? ఫ్యాన్స్ కౌంట‌ర్‌

Published on Fri, 05/30/2025 - 10:43

ఐపీఎల్‌-2025లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన తొలి క్వాలిఫ‌య‌ర్‌లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ఆట‌గాడు ముషీర్ ఖాన్ పట్ల ఆర్సీబీ సూప‌ర్ స్టార్ విరాట్ కోహ్లి ప్ర‌వర్తించిన తీరు వివాద‌స్ప‌దమైంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా కోహ్లిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.

అసలేమి జ‌రిగిదంటే?
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌.. ఆర్సీబీ బౌల‌ర్ల దాటికి 8.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 60 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ క్ర‌మంలో పంజాబ్ మెనెజ్‌మెంట్ యువ బ్యాట‌ర్ ముషీర్‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ్యాటింగ్‌కు పంపింది. అత‌డికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం గ‌మ‌నార్హం. అయితే క్రీజులోకి వ‌చ్చిన ముషీర్ తొలి బంతిని ఎదుర్కొనేందుకు గార్డ్ తీసుకుంటుండ‌గా.. స్లిప్‌లో ఉన్న కోహ్లి వాట‌ర్ బాయ్‌ను బ్యాటింగ్‌కు పంపారు అన్న‌ట్లు నవ్వుతూ సైగ చేశాడు. అయితే వాయిస్‌ అంత క్లారిటీగా స్టంప్స్‌ మైక్‌లో రికార్డు కాలేద.

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు జూనియ‌ర్ల ప‌ట్ల ఇలానే ప్ర‌వ‌ర్తిస్తావా? నీ స్దాయికి ఇది త‌గునా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రోవైపు కోహ్లి అభిమానులు అత‌డికి స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు. "ఇదే మ్యాచ్‌లో కొన్ని ఓవ‌ర్ల క్రితం మ‌షీర్ డ్రింక్స్ తీసుకొచ్చ‌డాని, అంత‌లోనే ఇప్పుడు బ్యాటింగ్‌కు రావ‌ల్సి వ‌చ్చింద‌ని కోహ్లి చెబుతున్నాడు. కావాల‌నే కోహ్లిని త‌ప్పుబ‌ట్టి ట్రోలు చేస్తున్నారని" ఓ యూజ‌ర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు

. కాగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన ముషీర్‌ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మూడు బంతులు ఎదుర్కొని సుయాష్‌ శర్మ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు వరకు ముషీర్‌ కేవలం డ్రింక్స్‌ అందించిడానికే పరిమితమయ్యాడు.

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)