Breaking News

Virat Kohli: వామికాతో ఫొటో షేర్‌ చేసిన కోహ్లి! క్షణాల్లోనే..

Published on Tue, 04/11/2023 - 17:16

Virat Kohli- Vamika: బిజీ బిజీగా గడిపే టీమిండియా స్టార్‌, ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన గారాలపట్టి వామికాకు సమయం కేటాయించాడు. స్విమ్మింగ్‌పూల్‌లో తన చిన్నారి కూతురితో సేద తీరుతున్న ఫొటోను మంగళవారం పంచుకున్నాడు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఫొటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌-2023లో బెంగళూరు వేదికగా ఆర్సీబీ- లక్నో మధ్య మ్యాచ్‌ జరిగింది.

తప్పని ఓటమి
సొంత మైదానంలో ఆడిన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అయితే, హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆఖరికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో విజయం ఖరారైంది. దీంతో డుప్లెసిస్ బృందానికి రాహుల్‌ సేన చేతిలో ఓటమి తప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు.

సెలబ్రిటీ ఇమేజ్‌కు దూరం
ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మ్యాచ్‌ ముగించుకున్న కోహ్లి తనకు దొరికిన కాస్త విరామం కూతురితో గడిపాడు. కాగా 2017లో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను కోహ్లి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు జనవరి 2021లో కూతురు వామిక జన్మించింది. అయితే, విరుష్క జంట మాత్రం ఇంతవరకు వామిక ఎలా ఉంటుందో అభిమానులకు చూపించలేదు.

తమ కూతురిని సెలబ్రిటీ ఇమేజ్‌కు ముఖ్యంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు ఇప్పటికే కోహ్లి- అనుష్క అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తన పూర్తి రూపాన్ని చూపించనప్పటికీ ఆమెతో గడిపిన అద్భుత క్షణాలను ఇలా కెమెరాలో బంధిస్తూ అప్పుడప్పుడు షేర్‌ చేస్తూ ఉంటారు.

చదవండి: అప్పుడేమో నోరు మూయాలన్నాడు! తర్వాత కోహ్లితో ఇలా.. గంభీర్‌ ఫొటో వైరల్‌ 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)