ధోనిని గుర్తు చేసిన కోహ్లి.. హెలికాప్టర్‌ షాట్‌తో భారీ సిక్స్‌! వీడియో వైరల్‌

Published on Mon, 01/16/2023 - 08:06

తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్‌ కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 110 బంతులు ఎదుర్కొన్న కింగ్‌ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్‌కు ఇది 46 సెంచరీ.

ఈ సిరీస్‌లో కింగ్‌కు ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా ఇప్పటివరకు విరాట్‌ కోహ్లి కెరీర్‌లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. ఇక ఈ మ్యాచ్‌లో 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.  ఇక ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ అసాంతం రాణించిన కోహ్లికి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ అవార్డు దక్కింది.

హెలికాప్టర్ షాట్‌ కొట్టిన విరాట్‌
ఈ మ్యాచ్‌లో అద్భతమైన హెలికాప్టర్ షాట్‌ బాదిన విరాట్‌ కోహ్లి.. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని గుర్తు చేశాడు. భారత ఇన్నింగ్స్‌ 44 ఓవర్‌ వేసిన కసున్ రజిత బౌలింగ్‌లో నాలుగో బంతిని ఫ్రంట్‌ఫుట్‌ వచ్చిన విరాట్‌ లాంగ్‌ ఆన్‌ దిశగా 97 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. విరాట్‌ అద్భుతమైన షాట్‌ చూసిన అభిమానులు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IND vs SL: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్‌.. విరాట్‌ ఏం చేశాడంటే?

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)