Breaking News

థ్యాంక్యూ డీకే.. అతడి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందా: ​కోహ్లి

Published on Fri, 05/24/2024 - 18:00

టీమిండియా వెట‌ర‌న్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ త‌న కెరీర్‌లో చివ‌రి ఐపీఎల్ ఆడేశాడు. అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఎలిమినేటర్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై ఓట‌మి అనంత‌రం కార్తీక్ త‌న 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌కు విడ్కోలు ప‌లికాడు. ఈ క్ర‌మంలో త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. కార్తీక్‌తో అనుబంధంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

దినేష్ కార్తీక్‌ను నేను తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2009 సంద‌ర్భంగా క‌లిశాను. బహుశా ద‌క్షిణాఫ్రికాలో అనుకుంటా. నేను అత‌డితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవ‌డం అదే మొద‌టి సారి. అత‌డు చాలా స‌ర‌దాగా ఉంటాడు. డికే చాలా యాక్టివ్‌ ఉంటాడు. అదేవిధంగా కన్‌ఫ్యూజ్డ్‌ పర్సన్. 

చాలా సార్లు అతడు ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. దినేశ్‌పై నాకు కలిగిన తొలి అభిప్రాయం ఇదే. డీకేకు అద్భుతమైన టాలెంట్‌ ఉంది. నేను మొదటిసారిగా చూసిన దినేష్‌కు, ఇప్పటి దినేష్‌లో ఎలాంటి మార్పులేదు. అతడు తెలివైనవాడు. అంతేకాకుండా చాలా ప్రశాంతంగా ఉంటాడు. 

ఫీల్డ్‌లోనే కాదు, ఆఫ్‌ది ఫీల్డ్‌ కూడా డీకేతో నాకు మంచి అనుబంధం ఉంది. కార్తీక్‌కు క్రికెట్‌పైనే కాకుండా ఇతర విషయాలపై మంచి అవహగహన ఉంది. అతడితో నాకు సంబంధించిన ఏ విషయమైన నేను చర్చిస్తాను. ఐపీఎల్‌-2022లో నేను పెద్దగా రాణించలేదు. 

ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో దినేష్  నా పక్కను కూర్చోని నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపాడు. నాలో ఉన్న లోపాలను నాకు అర్ధమయ్యేలా చెప్పాడు. నేను ఈ రోజు మెరుగ్గా ఆడుతున్నానంటే అందుకు కారణం డీకేనే. కార్తీక్‌లో తన నిజాయితీ,  ధైర్యం నాకు బాగా నచ్చాయి. నాకు పరిచయం అయినందుకు థంక్యూ డీకే అ‍ంటూ విరాట్ ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.
 

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)