Breaking News

Virat Kohli: అకాయ్‌ను ఆడిస్తున్న కోహ్లి.. వీడియో వైరల్‌

Published on Thu, 07/18/2024 - 16:20

భారత స్టార్‌ క్రికెట్‌ విరాట్‌ కోహ్లి ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. కుటుంబంతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడు అకాయ్‌ను కోహ్లి ఎత్తుకున్న వీడియో వైరల్‌ అవుతోంది.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియాను విజేతగా నిలపడంలో కోహ్లి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అమెరికా వేదికగా లీగ్‌ మ్యాచ్‌లలో తేలిపోయినా.. వెస్టిండీస్‌లో జరిగిన ఫైనల్లో ఈ రన్‌మెషీన్‌ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

బార్బడోస్‌లో టైటిల్‌ కోసం సౌతాఫ్రికాతో జరిగిన పోరులో ఈ ఓపెనర్‌ 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేసిన వేళ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌(31 బంతుల్లో 47 రన్స్‌)తో కలిసి టీమిండియాకు భారీ స్కోరు అందించాడు.

ఇక భారత్‌ విధించిన 177 పరుగుల లక్ష్మాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా తడబడటంతో ట్రోఫీ రోహిత్‌ సేన సొంతమైంది. ఏడు పరుగుల స్వల్ప తేడాతో ప్రొటిస్‌ జట్టుపై గెలిచిన టీమిండియా ఖాతాలో ఐదో ఐసీసీ టైటిల్‌ చేరింది.

ఈ మ్యాచ్‌ ముగియగానే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన కోహ్లి.. విజయోత్సవాల కోసం జట్టుతో పాటు స్వదేశానికి తిరిగి వచ్చాడు. అనంతరం లండన్‌ వెళ్లిపోయాడు.

కాగా కోహ్లి భార్య అనుష్క శర్మ తమ పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి అంతకంటే ముందే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో కుటుంబాన్ని కలుసుకున్న కోహ్లి ప్రస్తుతం వారితో సరదాగా సమయం గడుపుతున్నాడు.

ఈ నేపథ్యంలో కోహ్లి.. చిన్నారి అకాయ్‌ను ఎత్తుకుని ఆడిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, ఇందులో అకాయ్‌ ముఖం మాత్రం కనబడలేదు. కాగా తమ పిల్లల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు వారిని లైమ్‌లైట్‌కు దూరంగా ఉంచాలని విరుష్క జోడీ నిర్ణయం తీసుకుంది.

అందుకే ఇంతవరకు వామిక, అకాయ్‌లకు సంబంధించిన ఫొటోలు బయటకు రాలేదు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విరాట్‌- అనుష్క అకాయ్‌కు లండన్‌లో జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం సెలవుల్లో ఉన్న కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు సమాచారం.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)