Breaking News

విరాట్‌ కోహ్లి సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఒకే ఒక్కడు

Published on Thu, 01/25/2024 - 18:31

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఐసీసీ మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్నాడు. యాభై ఓవర్ల క్రికెట్‌లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్‌మెషీన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఈ మేరకు పురస్కారంతో గౌరవించింది. 

కాగా 2023లో కోహ్లి వింటేజ్‌ విరాట్‌ కోహ్లిని గుర్తుచేస్తూ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో బ్యాట్‌ ఝులిపించి ఆకాశమే హద్దుగా చెలరేగాడు

భారత్‌ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్లో ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌ 11 ఇన్నింగ్స్‌లో కలిపి 765 పరుగులు సాధించాడు. తద్వారా టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు అందుకున్నాడు. 

అంతేకాదు.. టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ పేరిట చెక్కు చెదరకుండా ఉన్న వన్డే సెంచరీల రికార్డును కూడా కింగ్‌ కోహ్లి 2023లోనే బద్దలు కొట్టాడు. ప్రపంచకప్‌-2023 తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి తన 50వ వన్డే శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా సచిన్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేసి.. వన్డే రారాజుగా అవతరించాడు. 

సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
కాగా విరాట్‌ కోహ్లి ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 2012, 2017, 2018లో కింగ్‌ ఈ పురస్కారాలు అందుకున్నాడు. తాజాగా మరోసారి అవార్డును తన కైవసం చేసుకున్న కోహ్లి.. ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న రికార్డు బ్రేక్‌ చేశాడు.

క్రికెట్‌ ప్రపంచంలో అత్యధికసార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్‌, మాజీ క్రికెటర్‌ ఏబీడీ గతంలో మూడుసార్లు ఈ అవార్డు గెలిచాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)