Breaking News

వరల్డ్‌కప్‌లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న విరాట్‌ కోహ్లి! వీడియో వైరల్‌

Published on Sun, 11/19/2023 - 22:05

వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో 12 ఏళ్ల వరల్డ్‌కప్‌ ట్రోఫి నిరీక్షణకు తెరదించాలని బరిలోకి దిగిన మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ ఓటమితో 140 కోట్ల భారతీయులకు గుండె కోతను మిగిల్చింది.

మరోవైపు ఈ ఫైనల్‌ పోరులో అద్బుత ప్రదర్శన ఆస్ట్రేలియా.. ఆరోసారి వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలిచింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్‌ హెడ్‌ కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్‌ హెడ్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతులు ఎదుర్కొన్న హెడ్‌ 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్‌ లబుషేన్‌(57) హాఫ్‌ సెంచరీతో రాణించాడు.అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 240 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

కన్నీరు పెట్టుకున్న విరాట్‌ కోహ్లి, మహ్మద్‌ సిరాజ్‌..
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వగానే స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌ తన బౌలింగ్‌లో విన్నింగ్‌ షాట్‌ కొట్టగానే సిరాజ్‌ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సమయంలో బుమ్రా అతడి దగ్గరకు వెళ్లి ఓదార్చాడు.

అంతకుముందు విరాట్‌ కోహ్లి కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆసీస్‌ విజయానికి చేరువులో ఉన్నప్పుడు కోహ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ టోర్నీ మొత్తం కోహ్లి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 765 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: CWC 2023: అన్నంత పనిచేసిన కమిన్స్‌.. టీమిండియా అభిమానుల హృదయాలు ముక్కలు

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)