Breaking News

విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు.. తొలి క్రికెట‌ర్‌గా

Published on Sat, 03/30/2024 - 16:54

టీమిండియా స్టార్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘ‌నత సాధించాడు. టీ20ల్లో ఒకే వేదిక‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా విరాట్ రికార్డుల‌కెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 83 ప‌రుగులు చేసిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

చిన్న‌స్వామి స్టేడియంలో కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు 3,276 టీ20 ర‌న్స్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ముష్ఫిక‌ర్ ర‌హీం పేరిట ఉండేది. మీర్పూర్ వేదిక‌గా అత‌డు ఇప్ప‌టివ‌ర‌కు 3,239 ప‌రుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ముష్ఫిక‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేశాడు.

ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లండ్ ఆట‌గాడు అలెక్స్ హేల్స్‌, బంగ్లాదేశ్ ప్లేయ‌ర్‌ త‌మీమ్ ఇక్బాల్ ఉన్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘ‌న విజ‌యం సాధించింది. 183 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేకేఆర్ కేవ‌లం 16.5 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. సునీల్ న‌రైన్‌(22 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌(39 నాటౌట్‌) అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)