Breaking News

చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా

Published on Thu, 04/24/2025 - 21:40

ఐపీఎల్‌-2025లో టీమిండియా స్టార్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఓపెన‌ర్ విరాట్ కోహ్లి త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో కింగ్ కోహ్లి హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌ను విరాట్‌ ఊతికారేశాడు. 

ఫిల్ సాల్ట్‌, ప‌డిక్క‌ల్‌తో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాల‌ను నెలకొల్పాడు. విరాట్‌ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగిన విరాట్ కోహ్లి ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..

👉టీ20 క్రికెట్‌లో ఒకే వేదిక‌పై 3500 పరుగులు చేసిన తొలి ఆట‌గాడిగా విరాట్ చ‌రిత్ర సృష్టించాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో 105 టీ20 ఇన్నింగ్స్‌లలో కోహ్లి 3500 పరుగులు చేశాడు.

టీ20ల్లో ఒకే స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
3500 - బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ(భారత్‌)
3373 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్‌లో ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్‌)
3253 - రోజ్ బౌల్, సౌతాంప్టన్‌లో జేమ్స్ విన్స్ (ఇంగ్లండ్‌)
3241 - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్‌లో అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్‌)
3238 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్‌లో తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్‌)

👉అదేవిధంగా టీ20 క్రికెట్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సందర్బాల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా విరాట్ రి​కార్డులకెక్కాడు. ఇప్పటివరకు కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 62 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్‌​ బాబర్‌(61) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బాబర్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.

👉ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 392 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొన‌సాగుతున్నాడు.

టీ20ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్లు వీరే..
62 - విరాట్ కోహ్లీ*
61 - బాబర్ అజామ్
57 - క్రిస్ గేల్
55 - డేవిడ్ వార్నర్
52 - జోస్ బట్లర్
52 - ఫాఫ్ డు ప్లెసిస్

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి