Breaking News

చ‌రిత్ర‌కు అడుగు దూరంలో విరాట్ కోహ్లి..

Published on Fri, 05/02/2025 - 17:21

ఐపీఎల్‌-2025లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు  మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆర్సీబీ శ‌నివారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్దానాన్ని తిరిగి కైవసం చేసుకోవాల‌ని బెంగ‌ళూరు భావిస్తోంది.

అయితే సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి(Virat Kohli)ని అరుదైన రికార్డు ఊరిస్తోంది.  ఈ మ్యాచ్‌లో కోహ్లి మ‌రో 53 ర‌న్స్ చేస్తే.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో  8,500 పరుగుల మైలురాయిని తొలి ఆట‌గాడిగా రికార్డుల‌కెక్కుతాడు. ఇప్ప‌టివ‌ర‌కు విరాట్ . 262 మ్యాచ్‌ల్లో 8,447 పరుగులు చేశాడు.

 కోహ్లి త‌ర్వాతి స్ధానంలో ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(6921) ఉన్నాడు. అయితే కోహ్లి కంటే రోహిత్ దాదాపు  2000 పరుగులు వెన‌క‌బ‌డి ఉన్నాడు. ఇక 2008లో ఆర్సీబీ త‌ర‌పున‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన కింగ్ కోహ్లి.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో త‌నకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

అత‌డి ఐపీఎల్ కెరీర్‌లో 8 సెంచరీలతో పాటు 61  అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది సీజ‌న్‌లో కూడా కింగ్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. వ‌రుస హాఫ్ సెంచ‌రీల‌తో ప్ర‌త్య‌ర్ధి జ‌ట్ల‌పై విరుచుకుప‌డుతున్నాడు. కోహ్లి 10 మ్యాచ్‌ల్లో 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు సాధించాడు. 

అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో మూడవ స్థానంలో ఈ ఆర్సీబీ మాజీ కెప్టెన్ కొన‌సాగుతున్నాడు.
చ‌ద‌వండి: Shikhar Dhawan: అవును.. ప్రేమలో ఉన్నాం!.. ఇంతకీ ఎవరీమె?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)