Breaking News

RCBvsPBKS: 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌.. వెక్కి వెక్కి ఏడ్చిన కోహ్లి! వీడియో వైర‌ల్‌

Published on Wed, 06/04/2025 - 07:42

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 18 ఏళ్ల క‌ల ఎట్ట‌కేల‌కు నెరవేరింది. ఐపీఎల్‌-2025 ఛాంపియ‌న్స్‌గా ఆర్సీబీ నిలిచింది. మంగ‌ళ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ పోరులో 6 ప‌రుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆర్సీబీ.. తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది.

ఈ విజ‌యనంత‌రం ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. ఎన్నో ఏళ్ల‌గా అంద‌ని ద్రాక్ష‌గా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీ.. ఎట్ట‌కేల‌కు త‌న సొంత‌మైనందుకు విరాట్ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. ఆఖ‌రి ఓవ‌ర్ అవుతున్న‌ప్ప‌టికి ఆర్సీబీ విజ‌యం లాంఛ‌నం కావ‌డంతో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న కింగ్.. చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. చివరి బంతి పడగానే మోకాళ్లపై కూర్చుని చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. తొలి సీజ‌న్ నుం​చి బెంగ‌ళూరుకే ఆడుతున్న విరాట్ కోహ్లి.. మూడు ఫైనల్స్(2009, 2011, 2016) తర్వాత తన కలను సాకారం చేసుకున్నాడు.  ప్ర‌తీ ఎడిష‌న్‌లోనూ సత్తా చాటే కోహ్లి.. ఈ ఏడాది సీజ‌న్‌లోకూడా దుమ్మ‌లేపాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 54.75 స‌గ‌టుతో 657 ప‌రుగులు చేశాడు. ఫైన‌ల్ మ్యాచ్‌లో కూడా కోహ్లి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేశాడు.


 

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)