Breaking News

మాట మార్చిన పాక్‌ క్రికెటర్‌.. అయినా కోహ్లితో నాకు పోలికేంటి?!

Published on Sat, 01/28/2023 - 11:43

Khurram Manzoor On Virat Kohli: టీమిండియా స్టార్‌, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి గురించి చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ ఖుర్రమ్‌ మంజూర్‌ మాట మార్చాడు. కోహ్లితో పోల్చుకుని అతడిని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, కేవలం తన విజయాల గురించి చెప్పుకోవడానికి మాత్రమే అలా మాట్లాడానని పేర్కొన్నాడు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం తన మాటలను వక్రీకరించాయన్నాడు.

పెద్ద ఎత్తున ట్రోలింగ్‌
కాగా 50 ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచంలో తానే నంబర్‌ 1 అని, కోహ్లి స్థానం తన తర్వాతే అంటూ ఖుర్రమ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా వన్డేల్లో తన సగటు 53 అని.. ప్రతి ఆరు ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ బాదానంటూ చెప్పుకొచ్చాడు. ఈ కోహ్లి పేరును ప్రస్తావిస్తూ ఖుర్రమ్‌ మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో అతడిపై భారీ ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది.

ఈ నేపథ్యంలో ఖుర్రమ్‌ మంజూర్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘కొన్ని మీడియా సంస్థలు, నా ఇంటర్వ్యూలో తీసుకున్న వాళ్లు నా మాటలను వక్రీకరించారు. విరాట్‌ కోహ్లి తరానికొక్క గొప్ప ప్లేయర్‌. ఓ ఆటగాడిగా తనని నేను ఆరాధిస్తాను.  

తనతో పోలికేంటి? 
లిస్ట్‌ ఏ క్రికెట్‌లో సెంచరీల నిష్పత్తి గురించి మాట్లాడుతూ.. కోహ్లి కంటే నా గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.. తను రెండో స్థానంలో ఉన్నాడని మాత్రమే చెప్పాను. తనతో నాకసలు పోలికే లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు.

గణాంకాలతో సంబంధం లేదు.. తను ఎప్పటికీ గొప్ప క్రికెటరే’’ అని ఖుర్రమ్‌ మంజూర్‌ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన గణాంకాలకు సంబంధించిన ఫొటోను జత చేశాడు. ఇకనైనా మీడియా సంస్థలు విచక్షణతో వ్యవహరించాలని చురకలు అంటించాడు. కాగా పాక్‌ తరఫున ఖుర్రమ్‌ 16 టెస్టులు, ఏడు వన్డేలు, మూడు టీ20లు ఆడాడు.

చదవండి: Hardik Pandya: మా ఓటమికి ప్రధాన కారణం అదే! అలాంటి ఆటగాడు జట్టులో ఉంటే మాత్రం..
Rahul Tripathi: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది'

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)