Breaking News

IPL 2024: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి క్రికెటర్‌గా రికార్డు

Published on Sat, 04/06/2024 - 22:44

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 7,500 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కింగ్‌ కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ క్యాష్‌ రిచ్‌లీగ్‌లో ఇప్పటివరకు 242 మ్యాచ్‌లు ఆడిన  విరాట్ 130.36 స్ట్రైక్ రేట్‌తో 7575 పరుగులు చేశాడు. ఐపీఎల్‍లో అత్యధిక పరుగుల రికార్డు కూడా విరాట్ పేరిటే ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

72 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. విరాట్‌ కోహ్లికి ఇది 8వ ఐపీఎల్‌ సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్‌ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్‌ కోహ్లినే కావడం విశేషం. 

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీరే..
విరాట్ కోహ్లి- 7575 పరుగులు (242 మ్యాచ్‌లు)
శిఖర్ ధావన్- 6754 పరుగులు (221 మ్యాచ్‌లు)
డేవిడ్ వార్నర్- 6545 పరుగులు (180 మ్యాచ్‌లు)
రోహిత్ శర్మ- 6280 పరుగులు (246 మ్యాచ్‌లు)
సురేశ్  రైనా- 5528 పరుగులు (205 మ్యాచ్‌లు)

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)