Breaking News

తొలిసారి అకాయ్‌తో కనిపించిన కోహ్లి.. ఫొటో వైరల్‌

Published on Tue, 06/16/2026 - 18:15

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించాడు. గాయం కారణంగా ఈ ‘రన్‌ మెషీన్‌’ ఆటకు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2026 ఫైనల్లో ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోహ్లి.. ఈ సందర్భంగా తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు.

అకాయ్‌తో కోహ్లి
ఫలితంగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు కోహ్లి దూరమయ్యాడు. ఇక ఐపీఎల్‌ ముగిసిన వెంటనే అతడు లండన్‌కి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో గార్డెన్‌లో తన కుమారుడు అకాయ్‌ను ఎత్తుకుని కోహ్లి ఆడిస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి.

మరికొన్ని ఫొటోల్లో కోహ్లి సతీమణి అనుష్క శర్మ తమ స్నేహితులతో ముచ్చటిస్తున్నట్లుగా ఉంది. అయితే, వీరి కుమార్తె వామిక మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక అకాయ్‌ని కోహ్లి ఎత్తుకున్నట్లుగా ఉన్నప్పటికీ అతడి ఫేస్‌ మాత్రం రివీల్‌ కాలేదు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

లండన్‌లోనే...
ఈ నేపథ్యంలో.. ‘‘ఇంకెప్పుడు చిన్నారి వామిక, జూనియర్‌ కోహ్లిని చూపిస్తావు భయ్యా!’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా 2017లో వివాహం చేసుకున్న విరాట్‌- అనుష్కలకు తొలి సంతానంగా 20121లో కుమార్తె వామిక జన్మించింది.

అనంతరం 2024లో లండన్‌లో ఈ జంట తమ కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చారు. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్‌లోనే నివసిస్తోంది. కాగా కోహ్లి- అనుష్క తమ పిల్లల్ని సోషల్‌ మీడియా ప్రపంచానికి దూరంగా పెంచుతున్నారు. 

ఇంత వరకు వారి ఫొటోలను ఎక్కడా రివీల్‌ కాకుండా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్‌ భారత వన్డే జట్టుతో చేరాడు. ఇక అఫ్గనిస్తాన్‌ తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)