Breaking News

‘బెస్ట్‌ ప్లేయర్లు’గా వినిసియస్, బొన్మాతి

Published on Thu, 12/19/2024 - 03:54

దోహా: రియల్‌ మాడ్రిడ్‌ స్టార్‌ వినిసియస్‌ జూనియర్‌ ఎట్టకేలకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య (ఫిఫా) అవార్డును చేజిక్కించుకున్నాడు. ఫురుషుల విభాగంలో అతను ‘ఫిఫా బెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు అందుకున్నాడు. ఈ అక్టోబర్‌లో ప్రతిష్టాత్మక బాలన్‌డోర్‌ అవార్డు రేసులో తుదిదాకా నిలిచినా...  అనూహ్యంగా మాంచెస్టర్‌ మిడ్‌ఫీల్డర్‌ రోడ్రి అందుకోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. 

ఇప్పుడు ‘ఫిఫా’ ప్రతిష్టాత్మక అవార్డుతో ఆ అవమానాన్ని, నిరాశను ఒక్కసారిగా అధిగమించినట్లయ్యింది. 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ‘ఫిఫా’ 11 మంది ప్లేయర్లను తుది అవార్డుల జాబితాకు ఎంపిక చేసింది. వీరిలో నుంచి వినిసియస్‌ విజేతగా నిలిచాడు. బ్రెజిల్‌కు చెందిన ఈ 24 ఏళ్ల స్టార్‌ స్ట్రయికర్‌ గత సీజన్‌లో విశేషంగా రాణించాడు. 

39 మ్యాచ్‌ల్లో 24 గోల్స్‌ సాధించాడు. స్పానిష్‌ టీమ్‌ రియల్‌ మాడ్రిడ్‌ 15వసారి యూరోపియన్‌ కప్‌ గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. మహిళల విభాగంలో ‘ఫిఫా బెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును స్పెయిన్‌ మిడ్‌ఫీల్డర్‌ ఐతనా బొన్మాతి కైవసం చేసుకుంది. 

26 ఏళ్ల స్పానిష్‌ స్టార్‌ ఇదివరకే వరుస సీజన్లలో బాలన్‌డోర్‌ అవార్డును ముద్దాడింది. అభిమానులు, ప్రస్తుత కెప్టెన్లు, కోచ్‌లు, ప్రపంచ వ్యాప్త జాతీయ ఫుట్‌బాల్‌ జట్లు, మీడియా ప్రతినిధులు వేసిన ఓట్లకు సమాన వెయిటేజీ ఇచ్చినట్లు ‘ఫిఫా’ వెల్లడించింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)