Breaking News

వినేశ్‌కు ‘నాడా’ నోటీసులు

Published on Thu, 09/26/2024 - 08:18

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) నోటీసులు జారీ చేసింది. ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే అంశంపై 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఈనెల 9న హరియాణాలోని ఖర్ఖోడ గ్రామంలో డోప్‌ టెస్టు నిర్వహించాలనుకుంటే ఆ సమయంలో వినేశ్‌ అందుబాటులో లేకపోవడంతో ‘నాడా’ ఈ నోటీసులు జారీ చేసింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌... వంద గ్రాములు అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. 

ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్‌... హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యరి్థగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న వినేశ్‌ హరియాణాలో విసృతంగా పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే వివరాలు అందించనందుకు గానూ వినేశ్‌కు నోటీసులు అందించాం. డోప్‌ నిరోధక అధికారి హాజరైన సమయంలో వినేశ్‌ అందుబాటులో లేదు. అందుకే ఈ నోటీసులు జారీ చేశాం’ అని ‘నాడా’ నోటీసులు పేర్కొంది. నిబంధనల ప్రకారం ఏడాది కాలంలో మూడుసార్లు వివరాలు అందించడంలో విఫలమైన అథ్లెట్లపై ‘నాడా’ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)