Breaking News

వినేశ్‌ ఫోగట్‌ కీలక నిర్ణయం.. రిటైర్మెంట్‌ వెనక్కి!?

Published on Sat, 08/17/2024 - 09:24

ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫోగట్ ఆధిక బరువు కారణంగా  అనర్హత వేటు పడి పతకాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే ఆమె తన రెజ్లింగ్ కెరీర్‌కు విడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

అయితే ఇప్పుడు వినేశ్‌ ఫోగట్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  తాజాగా ఎక్స్‌లో ఉద్వేగభరిత పోస్టు షేర్ చేసిన ఆమె.. అందులో పలు విషయాలను ప్రస్తావించింది. భవిష్యత్‌ ఎలా ఉంటుందో చెప్పలేను కానీ, రెజ్లింగ్ కొనసాగించే సత్తా మాత్రం తనకు ఉందని ఫోగట్ తెలిపింది.

"నా బృందానికి, నా తోటి భారతీయులకు, నా ఫ్యామిలీకి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మా లక్ష్యాన్ని మేము ఇంకా చేరుకోలేదు. ఏదో మిస్ అయినట్లు అన్పిస్తోంది. అయితే పరిస్థితులు ఇకపై మునపటిలా ఉండకపోవచ్చు. 

నేను 2032 వరకు రెజ్లింగ్ వృత్తిని కొనసాగించాలని భావిస్తున్నాను. కానీ భవిష్యత్ నా కేరీర్ ను ఎలా నిర్ణయిస్తుందో తెలియదు. కానీ నేను నమ్మిన దాని కోసం నా పోరాటం ఆపనని వినేష్ పేర్కొంది.

అదే విధంగా ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ టీమ్‌పై ఫోగట్ ప్రశంసల వర్షం కురిపించింది. వీరేన్ రస్కిన్హా, యతిన్ భట్కర్‌లతో పాటు చాలా మం‍ది ఇతర అథ్లెట్లు నాకు మద్దతుగా నిలిచారు. వారి సపోర్ట్‌తోనే నేను ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించగలిగాను. నాకు మద్దతుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు అంటూ ఫోగట్ ఎక్స్‌లో రాసుకొచ్చింది. 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)