Breaking News

‘టాప్స్‌’ జాబితా నుంచి వినేశ్, బజరంగ్‌ అవుట్‌

Published on Sat, 02/22/2025 - 07:13

న్యూఢిల్లీ: మెగా ఈవెంట్స్‌లో పతక విజేతల్ని తయారు చేయడమే లక్ష్యంగా అమలు చేస్తున్న టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌) జాబితాను కేంద్ర క్రీడా శాఖ కుదించింది. గతంలో 179 మందికి ‘టాప్స్‌’ కింద ఆర్థిక అండదండలు అందించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 94 మందికే చేయూత ఇవ్వనుంది. ఈ పథకం కింద లబ్ధి పొందిన క్రీడాకారుల ప్రదర్శనను సమీక్షించిన క్రీడాశాఖ దాదాపు సగం మందికి కోత పెట్టింది. 

ఈ 94 మంది జాబితాలో 42 మంది రెగ్యులర్‌ అథ్లెట్లు కాగా... 52 మంది పారా అథ్లెట్లున్నారు. పారిస్‌ పారాలింపిక్స్‌లో విశేష ప్రతిభ కనబరిచిన పారా అథ్లెట్లు 7 స్వర్ణాలు సహా 29 పతకాలు సాధించారు. దీంతో క్రీడాశాఖ దివ్యాంగ అథ్లెట్లకు ‘టాప్స్‌’లో పెద్దపీట వేసింది. గతంలో 78 మందితో ఉన్న రెగ్యులర్‌ అథ్లెట్లలో చాలా మందిని తప్పించింది.

గోల్ఫ్, స్విమ్మింగ్, టెన్నిస్‌లలో ఏ ఒక్కరికి ‘టాప్స్‌’లో చోటు దక్కలేదు. మేటి రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్, బజరంగ్‌ పూనియాలను ‘టాప్స్‌’ నుంచి తప్పించారు. రెజ్లింగ్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న వినేశ్‌ రాజకీయాల్లోకి వచ్చి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచింది. 

డోప్‌ టెస్టులకు గైర్హాజరు అయ్యాడనే కారణంగా జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) బజరంగ్‌పై నాలుగేళ్లు నిషేధం విధించింది.  క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా పారదర్శకంగా ఈ జాబితాను రూపొందించామని, కేవలం ప్రతిభే ప్రామాణికంగా తీసుకున్నామని దీనిపై టాప్స్‌ సీఈఓ ఎన్‌.ఎస్‌. జోహల్‌ వివరణ ఇచ్చారు.

అథ్లెటిక్స్‌లో నిరాశజనక ప్రదర్శన వల్ల 30 మంది కాగా ఇప్పుడు ముగ్గురితో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. చాంపియన్‌ జావెలిన్‌ త్రోయర్, స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా, స్టీపుల్‌చేజర్‌ అవినాశ్‌ సాబ్లే, లాంగ్‌ జంపర్‌ శ్రీశంకర్‌లకు మాత్రమే ‘టాప్స్‌’లో చోటు దక్కింది. 

తెలంగాణ రైజింగ్‌ స్టార్, ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య విజేత లవ్లీనా బొర్గొహైన్‌లు ఇద్దరూ మహిళా బాక్సర్లకే ‘టాప్స్‌’ లబ్ధి చేకూరనుంది. గతంలో 8 మంది బాక్సర్లుండగా కేవలం ఇద్దరే ఇద్దరికి చోటు దక్కింది. షట్లర్లలో కిడాంబి శ్రీకాంత్‌కు, డబుల్స్‌ స్పెషలిస్ట్‌ అశ్విని పొన్నప్పలను పక్కన బెట్టిన క్రీడాశాఖ... సింధు, ప్రణయ్, లక్ష్యసేన్, డబుల్స్‌ అగ్రశ్రేణి జోడీ సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టిలను జాబితాలో కొనసాగించింది.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)