Breaking News

వినేశ్‌ ఫోగట్‌ సంచలన నిర్ణయం... రెజ్లింగ్‌కు గుడ్‌ బై

Published on Thu, 08/08/2024 - 06:58

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌కు వినేష్‌ ఫొగాట్‌ రిటైర్మెంట్‌ ప్రకటించింది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌ ఫైనల్‌లో తలపడాల్సిన వినేశ్‌.. ఆధిక బరువు వల్ల  అనర్హతకు గురైన విషయం తెలిసిందే. 

బంగారు పతకానికి అడుగు దూరంలో నిలబడిన వినేశ్‌కు ఎదురుదెబ్బ తగలడంతో ఆమె కల చెదిరింది. ఈ క్రమంలోనే తన ఇష్టమైన క్రీడకు వినేశ్‌ విడ్కోలు పలికింది.  "నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. న‌న్ను క్ష‌మించిండి. 

మీ క‌ల‌, నా ధైర్యం అన్ని విచ్ఛిన్నం అయ్యాయి. నాకు ఇంకా పోరాడే ఓపిక లేదు. అందుకే నాకు ఇష్టమైన క్రీడ రెజ్లింగ్(2001-2024) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ఎక్స్‌లో వినేశ్‌ రాసుకొచ్చింది.

కాగా ఈ విశ్వక్రీడల్లో 50 కేజీల విభాగంలో ఫైనల్‌ చేరిన వినేశ్‌ పై 140 కోట్ల భారతీయలు బంగారు ఆశలు పెట్టుకున్నారు. కానీ అంతలోనే ఫోగాట్‌తో పాటు అందరి ఆశలు నీరుగారాయి. అనూహ్యంగా తన బరువు విభాగం (50కేజీ) కంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారని వినేశ్‌పై అనర్హత వేటు పడింది.

కాగా ఫొగాట్‌ తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ.. కోర్ట్‌ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్భిట్రేషన్‌ తీర్పు వెల్లడించాల్సి ఉండగా.. ఇంతలోనే వినేశ్‌ ఈ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)