Breaking News

కన్నీటి పర్యంతమైన వినేశ్‌ ఫొగాట్‌..! నిరూపిస్తే ఉరేసుకుంటానన్న ఎంపీ

Published on Thu, 01/19/2023 - 10:42

Indian Wrestler Vinesh Phogat: ‘పలువురు కోచ్‌లు అదే పనిగా లక్నోలో నిర్వహించే జాతీయ శిక్షణ శిబిరంలో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారు. 10, 12 మంది అమ్మాయిలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి పేర్లను ఇప్పుడే చెప్పను. ప్రధానిని కలిసే అవకాశమిస్తే ఆయనకే వివరిస్తా.

నేను ఇదివరకు ఒకసారి బ్రిజ్‌భూషణ్‌పై ఫిర్యాదు చేస్తే చంపుతామని బెదిరించారు’ అని కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్, ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగాట్‌ విలేకర్ల ముందు విలపించారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మీడియా ఎదుట ఆవేదన పంచుకున్నారు.

కాగా చాలా కాలంగా  బ్రిజ్‌భూషణ్‌ తమని లైంగికంగా వేధిస్తున్నారని భారత మహిళా స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్‌ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.

సంగీతా ఫొగాట్‌ భర్త, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య విజేత బజరంగ్‌ పూనియా, అతని కోచ్‌ సుజిత్‌ మాన్ సహా ఫిజియో ఆనంద్‌ దూబే వారికి మద్ధతుగా ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బజరంగ్‌ మాట్లాడుతూ తమ పోరాటం ప్రభుత్వం, కేంద్ర క్రీడా శాఖ, భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌)పై కాదని... కేవలం బ్రిజ్‌భూషణ్‌ నియంతృత్వంపైనే అని స్పష్టం చేశారు.   

అయితే, డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్‌, లోక్‌సభ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ మాత్రం తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ​కొట్టిపారేయడం గమనార్హం. ఈ ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఉరేసుకొంటానని సవాల్‌ చేశారు. ఓ పారిశ్రామిక వేత్త ప్రోద్బలంతో ఇదంతా జరుగుతోందని 66 ఏళ్ల బ్రిజ్‌భూషణ్‌ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా బ్రిజ్‌భూషణ్‌ 2011 నుంచి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.  

చదవండి: Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్‌.. నిప్పులు చెరిగిన లోకల్‌ బాయ్‌.. భావోద్వేగ ట్వీట్‌
ENG vs SA: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన! స్టార్‌ బ్యాటర్‌ వచ్చేశాడు

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)