Breaking News

విజేత విన్సెంట్‌ కీమెర్‌

Published on Fri, 08/15/2025 - 03:50

చెన్నై: ఆద్యంతం నిలకడగా రాణించిన జర్మనీ గ్రాండ్‌మాస్టర్‌ విన్సెంట్‌ కీమెర్‌ మరో రౌండ్‌ మిగిలి ఉండగానే... చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు. జోర్డెన్‌ వాన్‌ ఫారీస్ట్‌ (నెదర్లాండ్స్‌)తో గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్‌ గేమ్‌ను విన్సెంట్‌ కీమెర్‌ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఎనిమిదో రౌండ్‌ తర్వాత కీమెర్‌ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 

నాలుగు గేముల్లో నెగ్గిన కీమెర్, మరో నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, కార్తికేయన్‌ మురళీ 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. నేడు జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో కీమెర్‌ ఓడిపోయినా... అర్జున్, కార్తికేయన్‌ తమ గేమ్‌ల్లో విజయం సాధించినా జర్మనీ గ్రాండ్‌మాస్టర్‌ను అందుకోలేకపోతారు. 

ఎనిమిదో రౌండ్‌లో అర్జున్‌–విదిత్‌ గేమ్‌ 32 ఎత్తుల్లో; నిహాల్‌ సరీన్‌–కార్తికేయన్‌ మురళీ గేమ్‌ 61 ఎత్తుల్లో; అవండర్‌ లియాంగ్‌ (అమెరికా)–అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌) గేమ్‌ 37 ఎత్తుల్లో; ప్రణవ్‌ (భారత్‌)–రే రాబ్సన్‌ (అమెరికా) గేమ్‌ 35 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)