Breaking News

ప్రజ్ఞానందపై విజయసాయి రెడ్డి ప్రశంసలు

Published on Tue, 08/22/2023 - 17:15

భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందపై వైఎస్సార్‌సీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన ప్రజ్ఞానందను అభినందించారు. చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ మనందరినీ గర్వపడేలా చేశాడని కొనియాడారు.

వరల్డ్‌ నంబర్‌ 3ని ఓడించి.. ఫైనల్‌ పోరులో వరల్డ్‌ నంబర్‌ 1తో పోటీ పడుతున్న ప్రజ్ఞానందకు విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. కాగా అజర్‌బైజాన్‌లోని బకూ వేదికగా టైటిల్‌ కోసం ప్రజ్ఞానంద- మాగ్నస్‌ కార్ల్‌సన్‌ మధ్య మంగళవారం పోరు ఆరంభమైంది.

కాగా అంతకుముందు ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీఫైనల్లో ప్రజ్ఞానంద 3.5–2.5తో విజయం సాధించాడు. తద్వారా ఫైనల్‌ చేరి.. వచ్చే ఏడాది జరుగనున్న క్యాండిడేట్‌ టోర్నీకి అధికారికంగా అర్హత సాధించాడు. ఇక భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా 18 ఏళ్ల  ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)