Breaking News

ఇదేమి బ్యాటింగ్ బ్రో? అక్క‌డ కూడా ప‌రువు తీస్తున్నావుగా?

Published on Fri, 07/31/2026 - 11:55

లంకా ప్రీమియర్ లీగ్ (LPL)-2026లో క్యాండీ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను సంక్లిష్టం చేసుకుంది. గురువారం ప‌ల్లెక‌లే వేదిక‌గా జాఫ్నా కింగ్స్‌తో జ‌రిగిన త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో 21 ప‌రుగుల తేడాతో క్యాండీ రాయ‌ల్స్ ఓట‌మి పాలైంది. క్యాండీ ప్ర‌స్తుతానికి నాలుగో స్ధానంలో ఉన్న‌ప్ప‌టికి వారి ప్లే ఆఫ్స్ భ‌వితవ్యం దంబుల్లా సిక్స‌ర్‌పై ఆధార‌ప‌డి ఉంది. ఆదివారం జాఫ్నా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దంబుల్లా ఓటమిపాలైతే క్యాండీ ప్లే ఆఫ్స్‌ చేరేందుకు మార్గం సుగమవుతుంది.

ఇ​క ఈ మ్యాచ్ విషయానికి వస్తే..  టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జాఫ్నా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. జాఫ్నా బ్యాటర్లలో చమిందు విక్రమసింహే(15 బంతుల్లో 43), కమిల్‌ మిశ్రా(26 బంతుల్లో 49) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. క్యాండీ బౌలర్లలో మొయిన్‌ అలీ, హసరంగా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అవిష్క ఫెర్నాండో, జహీర్‌ ఖాన్‌ చెరో వికెట్‌ సాధించారు.

చేతులేత్తేసిన శంకర్‌
అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాండీ రాయల్స్‌కు ఓపెనర్లు లహిరు ఉదార(30), పవన్ సందేశ్(48) అద్భుతమైన ఆరంభం ఇచ్చారు.  వీరిద్దరూ ఔటయ్యాక క్యాండీ వికెట్ల పతనం మొదలైంది. అయితే మధ్యలో షాహీన్‌ అఫ్రిది(14 బంతుల్లో 24), కెప్టెన్‌ హసరంగ(24) దూకుడుగా ఆడడంతో క్యాండీ తిరిగి గేమ్‌లోకి వచ్చింది. 

కానీ వీరిద్దరి వికెట్లను క్యాండీ వరుస ఓవర్లలో కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన భారత మాజీ క్రికెటర్‌, క్యాండీ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ జిడ్డు బ్యాటింగ్‌ చేశాడు. గల్లీ క్రికెటర్‌ కంటే దారుణంగా ఆడుతూ ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. ఈ విజయ్ శంకర్‌ చివరి ఓవర్ వరకు బ్యాటింగ్ చేసినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. 

ఆఖరి ఓవర్‌లో క్యాండీ రాయల్స్ విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో విజయ్ శంకర్ ఉండగా.. మరోవైపు జాఫ్నా కెప్టెన్ బంతిని దిల్షాన్ మదుశంకకు అందించాడు. అయితే మదుశంక అద్భుతంగా బౌలింగ్ చేసి శంకర్‌కు చుక్కలు చూపించాడు. విజయ్ శంకర్ తొలి ఐదు బంతుల్లో కేవలం ఒక్క ఫోర్ కూడా బాదలేకపోయాడు. 

అలా అని నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న నువాన్ తుషారాకు స్ట్రైక్ ఇవ్వలేదు. స్ట్రైక్ తన వద్దే అంటి పెట్టుకుని తొలి ఐదు బంతులను డాట్ చేశాడు. ఆఖరి బంతికి ఔటై క్యాండీ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు. 21 బంతులు ఎదుర్కొన్న విజయ్ శంకర్‌.. 3 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. దీంతో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

ఇదేమి బ్యాటింగ్ అన్నా?  శ్రీలంక‌లో కూడా ప‌రువు తీస్తున్నావుగా? అంటూ ఓ యూజ‌ర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. కాగా భార‌త క్రికెట్‌తో పూర్తిగా తెగ‌దింపులు చేసుకున్న విజ‌య్ శంక‌ర్.. ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇందులో భాగంగానే  క్యాండీ రాయల్స్‌కు అత‌డు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)