Breaking News

చహల్‌ మ్యాజిక్‌.. శతక్కొట్టిన లోమ్రార్‌

Published on Mon, 12/11/2023 - 18:33

విజయ్‌ హజారే ట్రోఫీ 2023లో సెమీస్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఇవాళ (డిసెంబర్‌ 11) జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, రాజస్థాన్‌ జట్లు విదర్భ, ముంబై, బెంగాల్‌, కేరళ జట్లపై విజయాలు సాధించి ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించాయి. 

క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు చెందిన మహిపాల్‌ లోమ్రార్‌ (122 నాటౌట్‌, కేరళపై), బెంగాల్‌కు చెందిన షాబాజ్‌ అహ్మద్‌ (100, హర్యానా), హర్యానాకు చెందిన అంకిత్‌ కుమార్‌ (102, బెంగాల్‌పై), తమిళనాడు చెందిన బాబా ఇంద్రజిత్‌ (103 నాటౌట్‌, ముంబైపై) శతకాలతో చెలరేగగా.. హర్యానాను చెందిన యుజ్వేంద్ర చహల్‌ (10-0-37-4, బెంగాల్‌పై), కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్‌ వైశాక్‌ (8.5-2-44-4, విదర్భపై), రాజస్థాన్‌కు చెందిన అనికేత్‌ చౌదరీ (7-1-26-4, కేరళపై) బంతితో రాణించారు. 

డిసెంబర్‌ 13న జరిగే తొలి సెమీఫైనల్లో హర్యానా, తమిళనాడు.. డిసెంబర్‌ 14న జరిగే రెండో సెమీఫైనల్లో రాజస్థాన్‌, కర్ణాటక జట్లు తలపడనున్నాయి. రెండు సెమీఫైనల్స్‌లో విజేతలు డిసెంబర్‌ 16న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. 

క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల స్కోర్ల వివరాలు..
తొలి క్వార్టర్‌ ఫైనల్‌: 
బెంగాల్‌ 225 (50 ఓవర్లు)
హర్యానా 226/6 (45.1 ఓవర్లు)
4 వికెట్ల తేడాతో హర్యానా విజయం

రెండో క్వార్టర్‌ ఫైనల్‌: 
రాజస్థాన్‌ 267/8 (50 ఓవర్లు)
కేరళ 67/9 (21 ఓవర్లు)
200 పరుగుల తేడాతో రాజస్థాన్‌ విజయం

మూడో క్వార్టర్‌ ఫైనల్‌: 
విదర్భ 173 (42 ఓవర్లు)
కర్ణాటక 177/3 (40.3 ఓవర్లు)
7 వికెట్ల తేడాతో కర్ణాటక విజయం

నాలుగో క్వార్టర్‌ ఫైనల్‌: 
ముంబై 227 (48.3 ఓవర్లు)
తమిళనాడు 229/3 (43.2 ఓవర్లు)
7 వికెట్ల తేడాతో తమిళనాడు విజయం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)