Breaking News

టీజీ టి20 అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ

Published on Wed, 06/17/2026 - 03:41

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ (టీజీ) టి20 టోర్నమెంట్‌కు ప్రధాన స్పాన్సర్‌గా శ్రీనిధి యూనివర్సిటీ వ్యవహరించనుంది. మూడేళ్ల పాటు ఈ టోర్నీకి స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు హెచ్‌సీఏతో శ్రీనిధి యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 21 నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో సీజన్‌–1 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 8 టీమ్‌లు బరిలోకి దిగుతుండగా... తొలి పోరులో పాలమూరు స్ట్రయికర్స్‌తో ఖమ్మం ఏసెస్‌ జట్టు తలపడుతుంది. 

జూలై 12న ఫైనల్‌ నిర్వహిస్తారు.   భారత ఆటగాళ్లు తిలక్‌ వర్మ (మెదక్‌), మొహమ్మద్‌ సిరాజ్‌ (వరంగల్‌) కూడా ఈ టోర్నమెంట్‌లో మెదక్, వరంగల్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. బ్రాండ్‌ అంబాసిడర్‌ హోదాలో లీగ్‌కు ప్రచారం కల్పించేందుకు యువ హీరో విజయ్‌ దేవరకొండ కూడా సిద్ధమయ్యాడు. ‘దిగ్గజ ఆటగాళ్లంతా తమకంటూ గుర్తింపు రాని రోజుల్లో ఒక పెద్ద కల కని ఉంటారు. ఇప్పుడు టీజీ టి20లో ఆడే కుర్రాళ్లంతా అలాంటి కలతోనే బరిలోకి దిగుతున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ క్రికెటర్లు సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. 

ప్రతిభను ప్రోత్సహిస్తున్న ఇలాంటి లీగ్‌తో జత కట్టడం సంతోషంగా ఉంది’ అని విజయ్‌ దేవరకొండ వీడియో మెసేజ్‌ ఇచ్చాడు. ప్రారంభోత్సవం రోజున మ్యాచ్‌కు ముందు సంగీత దర్శకుడు తమన్‌ ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. ఆసక్తి గల అభిమానులు నేటి నుంచి ‘డిస్ట్రిక్ట్  ’ యాప్‌ ద్వారా మ్యాచ్‌ల టికెట్లు కొనుగోలు చేయవచ్చు. టీజీ టి20 లీగ్‌ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. మంగళవారం జరిగిన కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి, లీగ్‌ చైర్మన్‌ ఆగం రావు తదితరులు పాల్గొన్నారు. 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు