Breaking News

డబుల్‌ ధమాకా...

Published on Tue, 11/07/2023 - 03:46

ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ (యూకే): అంతర్జాతీయ వేదికపై భారత చెస్‌ క్రీడాకారులు ఆర్‌. వైశాలి, విదిత్‌ సంతోష్‌ గుజరాతి సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ దీవిలో జరిగిన స్విస్‌ గ్రాండ్‌ టోరీ్నలో ఓపెన్‌ విభాగంలో విదిత్‌ (మహారాష్ట్ర), మహిళల విభాగంలో వైశాలి (తమిళనాడు) చాంపియన్స్‌గా అవతరించారు. ఈ టోరీ్నలో టైటిల్‌ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరు గుర్తింపు పొందారు.

నిర్ణీత 11 రౌండ్ల తర్వాత విదిత్‌ 8.5 పాయింట్లతో... వైశాలి కూడా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. విదిత్‌ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. వైశాలి ఆరు గేముల్లో నెగ్గి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చాంపియన్స్‌గా నిలిచిన విదిత్‌కు ట్రోఫీలతో పాటు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షల 57 వేలు), వైశాలికి ట్రోఫీలతో పాటు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఈ టైటిల్స్‌తో ఓపెన్‌ విభాగంలో విదిత్‌... మహిళల విభాగంలో వైశాలి క్యాండిడేట్స్‌ టోరీ్నకి అర్హత సాధించారు. ఓపెన్, మహిళల విభాగాల్లో వేర్వేరుగా ఎనిమిది మంది ప్లేయర్ల మధ్య క్యాండిడేట్స్‌ టోర్నీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 2 నుంచి 25 వరకు కెనడాలోని టొరంటోలో జరుగుతుంది. క్యాండిడేట్స్‌ టోరీ్నలో విజేతగా నిలిచిన వారు ఓపెన్‌ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా)తో... మహిళల విభాగంలో ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ జు వెన్‌జున్‌ (చైనా)తో ప్రపంచ చాంపియన్‌íÙప్‌ టైటిల్‌ కోసం తలపడతారు.  

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)