Breaking News

దీపక్‌ హుడా సంచలన ఇన్నింగ్స్‌.. రికార్డులివే! మాక్స్‌వెల్‌తో పాటు..

Published on Fri, 12/15/2023 - 10:47

Deepak Hooda 180- VHT 2023 semi-final: టీమిండియా బ్యాటర్‌ దీపక్‌ హుడా దేశవాళీ వన్డే టోర్నీలో దుమ్ములేపాడు. విజయ్‌ హజారే ట్రోఫీ-2023 సెమీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కర్ణాటకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 128 బంతుల్లో 19 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 180 పరుగులు సాధించాడు.

లక్ష్య ఛేదనలో రెండో బ్యాటర్‌గా
తద్వారా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అరుదైన ఘనతలు సాధించాడు. భారత్‌ తరఫున లిస్ట్‌- ఏ క్రికెట్‌లో లక్ష్య ఛేదనలో పృథ్వీ షా(123 బంతుల్లో 185 పరుగులు- నాటౌట్‌) తర్వాత అత్యధిక స్కోరు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

అదే విధంగా.. విజయ్‌ హజారే ట్రోఫీ నాకౌట్‌ మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌(220), రవికుమార్‌ సమర్థ్‌(192), పృథ్వీ షా(185) తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా దీపక్‌ హుడా చరిత్రకెక్కాడు.

మాక్స్‌వెల్‌తో పాటు ఆ జాబితాలో
అంతేగాక.. లిస్ట్‌-ఏ చరిత్రలో ఛేజింగ్‌లో నంబర్‌ 4లో వచ్చి అత్యధిక స్కోరు చేసిన నాలుగో క్రికెటర్‌గా దీపక్‌ హుడా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెప్‌ మాక్స్‌వెల్‌(201*), అఫ్గనిస్తాన్‌ బ్యాటర్‌ సమీఉల్లా షెన్వారీ(192), బంగ్లాదేశ్‌కు చెందిన రకీబుల్‌ హసన్‌(190) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. 

హరియాణాతో ఫైనల్లో రాజస్తాన్‌ అమీతుమీ
కాగా దీపక్‌ హుడా అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీలో రాజస్తాన్‌ జట్టు ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే. కర్ణాటకతో రెండో సెమీఫైనల్లో రాజస్తాన్‌ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. కర్ణాటక నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కెప్టెన్‌ దీపక్‌ హుడా (128 బంతుల్లో 180; 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాజస్తాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. కరణ్‌ లాంబా (73 నాటౌట్‌; 7 ఫోర్లు)తో కలిసి దీపక్‌ నాలుగో వికెట్‌కు 255 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. శనివారం జరిగే ఫైనల్లో హరియాణాతో రాజస్తాన్‌ తలపడుతుంది.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)