చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్‌.. రంజీల్లో ఆల్‌టైమ్‌ రికార్డు

Published on Thu, 01/30/2025 - 17:59

సౌరాష్ట్ర వెటరన్‌ క్రికెటర్‌ షెల్డన్‌ జాక్సన్‌(Sheldon Jackson) సరికొత్త చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) టోర్నీలో అత్యధిక సిక్సర్లు(Highest Six Hitter) బాదిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అసోంతో మ్యాచ్‌ సందర్భంగా షెల్డన్‌ జాక్సన్‌ ఈ ఘనత సాధించాడు. కాగా దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌ రెండో దశ పోటీలు జనవరి 23న మొదలయ్యాయి.

ఇందులో భాగంగా ఎలైట్‌ గ్రూప్‌-డిలో ఉన్న సౌరాష్ట్ర.. తొలుత ఢిల్లీతో తలపడి పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్‌లో గురువారం అసోంతో రాజ్‌కోట్‌ వేదికగా రెండో మ్యాచ్‌ మొదలుపెట్టింది. ఇందులో టాస్‌ గెలిచిన ఆతిథ్య సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

అదిరిపోయే ఆరంభం
ఈ క్రమంలో ఓపెనర్లు హర్విక్‌ దేశాయ్‌, చిరాగ్‌ జైనీ అదిరిపోయే ఆరంభం అందించారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హర్విక్‌ శతకంతో చెలరేగాడు. 181 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లతో రాణించి.. 130 పరుగులు చేశాడు. మరోవైపు.. చిరాగ్‌ 78 బంతుల్లోనే 80 పరుగులతో సత్తా చాటాడు.

144వ సిక్సర్‌
ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఛతేశ్వర్‌ పుజారా కూడా బ్యాట్‌ ఝులిపించగా.. నాలుగో స్థానంలో వచ్చిన షెల్డన్‌ జాక్సన్‌ కూడా కాసేపు అలరించాడు. మొత్తంగా 86 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 48 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఒక సి​క్సర్‌ ఉంది. కాగా రంజీల్లో జాక్సన్‌కు ఇది 144వ సిక్సర్‌.

ఆల్‌టైమ్‌ రికార్డు
ఈ క్రమంలోనే 38 ఏళ్ల షెల్డన్‌ జాక్సన్‌ రంజీల్లో ఆల్‌టైమ్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. రంజీ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నమన్‌ ఓజా పేరిట ఉండేది. అతడు రంజీల్లో 143 సిక్సర్లు కొట్టాడు. తాజాగా షెల్డన్‌ జాక్సన్‌ నమన్‌ ఓజాను అధిగమించాడు.

పటిష్ట స్థితిలో సౌరాష్ట్ర
ఇక సౌరాష్ట్ర- అసోం మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 90 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని.. కేవలం మూడు వికెట్ల నష్టానికి 361 పరుగులు సాధించింది. గురువారం ఆట పూర్తయ్యేసరికి ఛతేశ్వర్‌ పుజారా 95, అర్పిత్‌ వసవాడ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా అర్ధ శతకానికి రెండు పరుగుల దూరంలో ఉన్న వేళ షెల్డన్‌ జాక్సన్‌.. టీమిండియా యువ సంచలనం రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడం గమనార్హం.

అద్బుతమైన రికార్డులు ఉన్నా
ఇదిలా ఉంటే.. రంజీల్లో షెల్డన్‌ జాక్సన్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. సౌరాష్ట్ర తరఫున ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇప్పటి వరకు 6600కు పైగా పరుగులు సాధించాడు. తద్వారా సితాన్షు కొటక్‌, ఛతేశ్వర్‌ పుజారా తర్వాత సౌరాష్ట్ర తరఫున ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.

ఇప్పటి వరకు షెల్డన్‌ జాక్సన్‌ ఖాతాలో 21 ఫస్ట్‌క్లాస్‌ సెంచరీలు ఉండటం విశేషం. 2019-20 సీజన్‌లో సౌరాష్ట్ర తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ గెలిచిన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో 809 పరుగులతో రాణించి సౌరాష్ట్ర ట్రోఫీ సొంతం చేసుకోవడంలో జాక్సన్‌ కీలక పాత్ర పోషించాడు. సెమీ ఫైనల్‌తో కలిపి మొత్తంగా నాడు మూడు శతకాలు బాదాడు.

ఇటీవలే గుడ్‌బై
అంతేకాదు.. 2022-23లో రెండోసారి సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలిచినపుడు కూడా.. జాక్సన్‌ 588 రన్స్‌ చేశాడు. సెమీస్‌ మ్యాచ్‌లో ఏకంగా 160 పరుగులతో చెలరేగడం విశేషం. అయితే, అతడికి ఒక్కసారి కూడా టీమిండియా తరఫున ఆడే అవకాశం రాలేదు. 

ఇక పరిమిత ఓవర్ల ఆటలోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న షెల్డన్‌ జాక్సన్‌ ఇటీవలే వైట్‌బాల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 86 మ్యాచ్‌లు ఆడిన షెల్డన్‌ జాక్సన్‌ 2792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 14 అర్ధ శతకాలు ఉన్నాయి.

చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి!

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)