Breaking News

రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత హాకీ లెజెండ్‌..

Published on Mon, 07/22/2024 - 17:02

భార‌త హాకీ లెజెండ్ పీఆర్ శ్రీజేష్ త‌న 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు ప‌లికేందుకు సిద్ద‌మ‌య్యాడు. ప్యారిస్ ఒలింపిక్స్‌-2024 త‌ర్వాత శ్రీజేష్ అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌నున్నాడు.  ఈ విష‌యాన్ని అతడు సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. ఎక్స్‌(ట్విట‌ర్‌)లో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. 

"ప్యారిస్‌లో జ‌రిగే ఒలింపిక్స్ అనంత‌రం నా కెరీర్‌కు ముగింపు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. భార‌త జెర్సీని ధ‌రించడం ఇదే చివ‌రి సారి. ఈ సారి ఒలింపిక్స్ కోసం ఎంతో ఆతృగా ఎదురుచూస్తున్నాను. నా ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. 

ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన హాకీ ఇండియా,  నా కుటుంబం, సహచరులు, కోచ్‌లు, అభిమానులందరికి ధన్యవాదాలు. వారి ప్రేమాభిమానాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనని. నాపై ఇప్ప‌టికి న‌మ్మ‌కం ఉంచినందుకు హాకీ ఇండియాకు స్పెష‌ల్ థాంక్స్ చెప్పాల‌నకుంటున్నాను.

నా స‌హ‌చ‌ర‌లు సైతం క‌ఠినమైన స‌మ‌యాల్లో నా ప‌క్క‌నే ఉన్నారు. ఎన్నో టోర్నీల్లో మేమందరం కలిసి విజయం సాధించాము. ఇప్పుడు మ‌రోసారి ప్యారిస్‌లోనూ మ‌న జెండా ఎగ‌ర‌వేద్దాం" అని ఎక్స్‌లో శ్రీజేష్ పేర్కొన్నాడు. 

2006లో సౌత్ ఆసియన్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన శ్రీజేష్‌.. ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా, గోల్‌కీపర్‌గా భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు శ్రీజేష్ సారథ్యం వహించాడు. 

2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హారీ జట్టులో శ్రీజేష్ సభ్యునిగా ఉన్నాడు. ఇది శ్రేజేష్‌కు నాలుగో ఒలింపిక్స్ కావడం గమనార్హం.  అతడి కెరీర్‌లో రెండు ఆసియా గేమ్స్ బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2021లో శ్రేజేష్ 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు.

 

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)