Breaking News

వెర్‌స్టాపెన్‌ షో షురూ 

Published on Sun, 03/03/2024 - 00:37

బహ్రెయిన్‌: వరుసగా గత మూడు సీజన్ల పాటు ఫార్ములా వన్‌ సర్క్యూట్‌ను శాసించిన రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ కొత్త సీజన్‌ను మళ్లీ అదే జోరుతో మొదలు పెట్టాడు. 2024లో తొలి ఎఫ్‌1 రేస్‌ అయిన బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. సమీప ప్రత్యర్థికంటే ఏకంగా 22.457 సెకన్ల తేడాతో  రేస్‌ను ముగించడం అతని ఆధిపత్యాన్ని చూపిస్తోంది. శనివారం జరిగిన రేస్‌ను వెర్‌స్టాపెన్‌ 1 గంటా 31 నిమిషాల 44.472 సెకన్లలో పూర్తి చేశాడు.

రెడ్‌బుల్‌కే చెందిన సెర్గియో పెరెజ్‌ రెండో స్థానంలో నిలవగా, ఫెరారీ డ్రైవర్‌ కార్లోస్‌ సెయింజ్‌కి మూడో స్థానం దక్కింది. స్టార్‌ మెర్సిడెజ్‌ డ్రైవర్‌ లూయీస్‌ హామిల్టన్‌ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వెర్‌స్టాపెన్‌ అంచనాలను అందుకున్నాడు. 57 ల్యాప్‌లు అన్నింటిలో ముందంజలో నిలిచిన అతను తన కెరీర్‌లో 55వ విజయాన్ని అందుకున్నాడు. సీజన్‌లో రెండో రేసు ఈ నెల 9న సౌదీ అరేబియాలో జరుగుతుంది. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)