Breaking News

తన్వీ, వెన్నెలకు కాంస్యాలు

Published on Sun, 07/27/2025 - 04:15

సోలో (ఇండోనేసియా): భారత రైజింగ్‌ షట్లర్లు వెన్నెల కలగొట్ల, తన్వీ శర్మలు ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు. అండర్‌–19 మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరడం ద్వారానే కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకున్న వీళ్లిద్దరికి శనివారం సెమీఫైనల్లో చుక్కెదురైంది. తెలుగమ్మాయి వెన్నెల 15–21, 18–21తో  చైనాకు చెందిన లియూ సి యా చేతిలో పోరాడి ఓడింది. 37 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో రెండో గేమ్‌ను చేజిక్కించుకునేందుకు వెన్నెల చెమటోడ్చింది. 

15–20తో ఇక మ్యాచ్‌ ఓడిపోయి స్థితిలో ఉన్నప్పటికీ ఏమాత్రం నిరాశచెందకుండా వరుసగా మూడు పాయింట్లను సాధించి రేసులో నిలిచింది. కానీ చైనా ప్రత్యర్థి ఈ దశలో మరింత జాగ్రత్త పడటంతో గెలిచేందుకు అవసరమైన పాయింట్‌ సాధించి ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో తన్వీ శర్మ 13–21, 14–21తో ఎనిమిదో సీడ్‌ యిన్‌ యి కింగ్‌ (చైనా) ధాటికి నిలువలేకపోయింది. తొలి గేమ్‌ను కోల్పోయిన పంజాబీ షట్లర్‌ ఒక దశలో రెండో గేమ్‌ను దూకుడుగా మొదలుపెట్టింది. 

6–1 ఆధిక్యంతో జోరుపెంచింది. కానీ వరుస తప్పిదాలతో పాయింట్లను కోల్పోయి 8–8 వద్ద సమం కాగా అక్కడి నుంచి పట్టు కోల్పోయింది. గత నెల యూఎస్‌ ఓపెన్‌ సూపర్‌–300 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన తన్వీ వరుసగా ఈ టోర్నీలో కాంస్యం గెలుపొందడం విశేషం. మొత్తం మీద ఈ జూనియర్‌ ఆసియా టోర్నీలో 13 ఏళ్ల పతక నిరీక్షణకు వెన్నెల, తన్వీ కాంస్యాలతో తెరదించారు. చివరిసారిగా భారత్‌ 2012లో స్వర్ణం గెలుచుకుంది. పీవీ సింధు ఆ ఏడాది విజేతగా నిలిచింది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)