Breaking News

చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా

Published on Tue, 01/28/2025 - 21:04

టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన మణికట్టు మయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో వరుణ్ ఐదు వికెట్లతో మెరిశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లకు వరుణ్‌ బంతితో చుక్కలు చూపించాడు. అతడిని ఎదుర్కొవడం ఇంగ్లండ్ బ్యాటర్ల తరం కాలేదు.

అద్బుతమైన గూగ్లీలతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అతడి దెబ్బకు వరుస క్రమంలో ఇంగ్లండ్ వికెట్లు కోల్పోయింది. ఓవరాల్‌గా తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుణ్‌కు ఇది తన టీ20 కెరీర్‌లో రెండో ఫైవ్ వికెట్‌​ హాల్ కావడం గమనార్హం. తద్వారా వరుణ్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

వరుణ్ సాధించిన రికార్డులు ఇవే..
👉వ‌రుస‌గా రెండు టీ20 సిరీస్‌ల‌లో ఐదు వికెట్ల ఘ‌న‌త సాధించిన తొలి భార‌త బౌల‌ర్‌గా వ‌రుణ్ రికార్డుల‌కెక్కాడు. వ‌రుణ్ ఈ సిరీస్ కంటే ముందు ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన సిరీస్‌లోనూ ఐదు వికెట్ల‌తో మెరిశాడు. ఇప్పుడు రాజ్‌కోట్ టీ20లో ఇంగ్లండ్‌పై ఐదు వికెట్లు సాధించాడు. దీంతో ఈ అరుదైన ఫీట్‌ను చక్రవర్తి తన ఖాతాలో వేసుకున్నాడు.

👉అదే విధంగా వ‌రుస‌గా రెండు టీ20 సిరీస్‌ల‌లో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా వరుణ్ రికార్డు సృష్టించాడు. ద‌క్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో 12 వికెట్లు పడగొట్టిన వరుణ్‌.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లో తొలి మూడు టీ20లలోనే 10 వికెట్లు పడగొట్టాడు.

👉అంతర్జాతీయ టీ20ల్లో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించిన మూడో భారత బౌలర్‌గా వరుణ్ నిలిచాడు. వరుణ్ కంటే ముందు కుల్దీప్ యాదవ్‌, భువనేశ్వర్ కుమార్ రెండు సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితోపాటు హార్దిక్‌ పాండ్యా రెండు, రవి బిష్ణోయ్‌ వికెట్‌ సాధించారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో బెన్‌ డకెట్‌(51) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. లివింగ్‌ స్టోన్‌(43), జోస్‌ బట్లర్‌(24) పరుగులతో రాణించారు.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి