Breaking News

రెండో రౌండ్‌లో వంతిక అగర్వాల్‌

Published on Tue, 07/08/2025 - 03:35

బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్‌ నాకౌట్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వంతిక అగర్వాల్, పద్మిని రౌత్, పీవీ నందిత రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా... కిరణ్‌ మనీషా మొహంతి తొలి రౌండ్‌లోనే  నిష్క్రమించింది. కె.ప్రియాంక భవిత్యం నేడు జరిగే టైబ్రేక్‌ గేమ్‌లలో తేలనుంది. తొలి రౌండ్‌లో వంతిక 1.5–0.5తో లాలా షొహోర్దోవా (తుర్క్‌మెనిస్తాన్‌)పై, పద్మిని 2–0తో జాంగ్‌ లాన్‌లిన్‌ (చైనా)పై, నందిత 2–0తో ఒరిట్జ్‌ అనాహి (ఈక్వెడార్‌)పై గెలుపొందారు. 

కిరణ్‌ మనీషా 0.5–1.5తో సాంగ్‌ యుజిన్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్‌లోని రెండు గేమ్‌లు ముగిశాక ప్రియాంక–గాల్‌ జొసోకా (హంగేరి) 1–1తో సమంగా నిలిచారు. షొహోర్దోవాతో ఆదివారం తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న వంతిక సోమవారం జరిగే రెండో గేమ్‌లో 29 ఎత్తుల్లో నెగ్గింది. 

జాంగ్‌ లాన్‌లిన్‌పై తొలి గేమ్‌లో గెలిచిన పద్మిని సోమవారం జరిగిన రెండో గేమ్‌లో 34 ఎత్తుల్లో... అనాహిపై తొలి గేమ్‌లో నెగ్గిన నందిత రెండో గేమ్‌లో 64 ఎత్తుల్లో విజయం అందుకున్నారు. సాంగ్‌ యుజిన్‌ చేతిలో తొలి గేమ్‌లో ఓడిపోయిన మనీషా రెండో గేమ్‌ను 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని ఇంటిదారి పట్టింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)