Breaking News

వారెవ్వా వాలెంటిన్‌...

Published on Mon, 10/13/2025 - 04:29

షాంఘై: ఊహకందని ప్రదర్శనతో ఆద్యంతం అదరగొట్టిన మొనాకో టెన్నిస్‌ ప్లేయర్‌ వాలెంటిన్‌ వాచెరోట్‌ తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం ముగిసిన షాంఘై ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌–1000 సిరీస్‌ టోర్నీలో ప్రపంచ 204వ ర్యాంకర్‌ వాలెంటిన్‌ చాంపియన్‌గా అవతరించాడు. క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మెయిన్‌ ‘డ్రా’లో అడుగు పెట్టిన వాలెంటిన్‌... మెయిన్‌ ‘డ్రా’లోనూ మెరిపించాడు. 

ఫైనల్లో వాలెంటిన్‌ 4–6, 6–3, 6–3తో ఆర్థర్‌ రిండెర్‌నీచ్‌ (నెదర్లాండ్స్‌)పై గెలుపొంది తన కెరీర్‌లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన వాలెంటిన్‌కు 11 లక్షల 24 వేల 380 డాలర్ల (రూ. 9 కోట్ల 97 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

‘కంటి నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయి. జరిగింది నమ్మశక్యంగా లేదు. ఏటీపీ సర్క్యూట్‌లో నాకిది నాలుగో సీజన్‌ మాత్రమే. నా విజయం వెనుక నా శిక్షణ సిబ్బంది పాత్ర ఎంతో ఉంది’ అని ఏటీపీ సర్క్యూట్‌లో టైటిల్‌ నెగ్గిన తొలి మొనాకో ప్లేయర్‌గా గుర్తింపు పొందిన వాలెంటిన్‌ వ్యాఖ్యానించాడు.  

క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో వాలెంటిన్‌ 7–6 (7/4), 6–3తో నిశేష్‌ బసవరెడ్డి (అమెరికా)పై, రెండో రౌండ్‌లో 4–6, 7–6 (7/5), 6–4తో లియామ్‌ డ్రాక్సెల్‌ (కెనడా)పై గెలిచి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో వాలెంటిన్‌ 6–3, 6–4తో లాస్లో జెరె (సెర్బియా)పై, రెండో రౌండ్‌లో 3–6, 6–3, 6–4తో 14వ సీడ్‌ అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌)పై, మూడో రౌండ్‌లో 6–0, 3–1తో 20వ సీడ్‌ టామస్‌ మఖాచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌–రిటైర్డ్‌)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 4–6, 7–6 (7/1), 6–4తో 27వ సీడ్‌ టాలన్‌ గ్రీక్‌స్పూర్‌ (నెదర్లాండ్స్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 2–6, 7–6 (7/4), 6–4తో 10వ సీడ్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌)పై, సెమీఫైనల్లో 6–3, 6–4తో నాలుగో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)పై విజయం సాధించాడు.  

5 కెరీర్‌లో తొలి టైటిల్‌ ‘మాస్టర్స్‌ సిరీస్‌’ టోర్నీని సాధించిన ఐదో ప్లేయర్‌గా వాలెంటిన్‌ నిలిచాడు. గతంలో రొబెర్టో కార్రెటెరో, అల్బెర్ట్‌ పొరా్టస్, క్రిస్‌ వుడ్‌రఫ్, జాకుబ్‌ మెన్‌సిక్‌ ఈ ఘనత సాధించారు.  

3 క్వాలిఫయర్‌ హోదాలో ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ గెలిచిన మూడో ప్లేయర్‌గా వాలెంటిన్‌ నిలిచాడు. గతంలో రొబెర్టో కార్రెటెరో (స్పెయిన్‌; 1996లో హంబర్గ్‌ ఓపెన్‌), అల్బెర్ట్‌ పొరా్టస్‌ (స్పెయిన్‌; 2001లో హంబర్గ్‌ ఓపెన్‌) మాత్రమే ఈ ఘనత సాధించారు.  

204 ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌ (1990లో) టోర్నీలు ప్రవేశపెట్టాక మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ గెలిచిన అతి తక్కువ ర్యాంకర్‌గా వాలెంటిన్‌ (204వ ర్యాంక్‌) గుర్తింపు పొందాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)