Breaking News

వెల్‌డన్‌ వైశాలి

Published on Thu, 01/02/2025 - 03:22

న్యూయార్క్‌: అంచనాలకు మించి రాణించిన భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేశ్‌బాబు తన కెరీర్‌లో గొప్ప ఘనత సాధించింది. ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో 23 ఏళ్ల వైశాలి కాంస్య పతకాన్ని గెల్చుకుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో వైశాలి పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. 

చైనా గ్రాండ్‌మాస్టర్‌ జు వెన్‌జున్‌తో    జరిగిన సెమీఫైనల్లో తమిళనాడుకు చెందిన వైశాలి 0.5–2.5తో ఓడిపోయింది. మరో సెమీఫైనల్లో లె టింగ్‌జీ (చైనా) 3.5–2.5తో కాటరీనా లాగ్నో (రష్యా)పై గెలిచింది. జు వెన్‌జున్‌తో జరిగిన సెమీఫైనల్‌ తొలి గేమ్‌ను వైశాలి 85 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. రెండో గేమ్‌లో జు వెన్‌జున్‌ 86 ఎత్తుల్లో... మూడో గేమ్‌లో 36 ఎత్తుల్లో వైశాలిని ఓడించి 2.5–0.5తో విజయాన్ని ఖరారు చేసుకుంది. 

ఫలితం తేలిపోవడంతో వీరిద్దరి మధ్య నాలుగో గేమ్‌ను నిర్వహించలేదు. సెమీఫైనల్లో ఓడిన వైశాలి, కాటరీనా లాగ్నోలకు కాంస్య పతకాలు లభించాయి. ఫైనల్లో వెన్‌జున్‌ 3.5–.2.5తో లె టింగ్‌జీపై గెలిచి తొలిసారి ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌గా అవతరించింది.  

3 ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా వైశాలి గుర్తింపు పొందింది. 2017లో విశ్వనాథన్‌ ఆనంద్‌ కాంస్య పతకం... 2022లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి రజత పతకం గెలిచారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)