Breaking News

‘గ్రాండ్‌మాస్టర్‌’ వైశాలి

Published on Sun, 12/03/2023 - 00:35

చెన్నై: భారత చెస్‌ క్రీడాకారిణి వైశాలి రమేశ్‌బాబు తన కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకుంది. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల వైశాలి శుక్రవారం ‘గ్రాండ్‌మాస్టర్‌’ హోదాను అందుకుంది. స్పెయిన్‌లో జరుగుతున్న ఎలోబ్రిగాట్‌ ఓపెన్‌ సందర్భంగా జీఎం గుర్తింపును దక్కించుకుంది. టోర్నీ తొలి రెండు రౌండ్‌లలో విజయం సాధించిన వైశాలి ఈ క్రమంలో 2500 ఎలో రేటింగ్‌ను దాటడంతో గ్రాండ్‌మాస్టర్‌ ఖాయమైంది.

భారత్‌ తరఫున ఈ ఘనతను సాధించిన 84వ ప్లేయర్‌గా వైశాలి గుర్తింపు పొందగా...భారత్‌నుంచి జీఎంగా మారిన మూడో మహిళా ప్లేయర్‌ మాత్రమే కావడం విశేషం. ఇప్పటికే చెస్‌ ప్రపంచంలో సంచలన విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీఎం ప్రజ్ఞానందకు వైశాలి స్వయంగా అక్క కావడం విశేషం.

వైశాలికంటే నాలుగేళ్లు చిన్నవాడైన ప్రజ్ఞానంద 2018లోనే గ్రాండ్‌మాస్టర్‌ హోదా అందుకోగా... ఐదేళ్ల తర్వాతి వైశాలి ఈ జాబితాలో చేరింది. తద్వారా ప్రపంచ చెస్‌లో గ్రాండ్‌మాస్టర్లుగా నిలిచిన తొలి సోదర, సోదరి ద్వయంగా వీరిద్దరు నిలవడం చెప్పుకోదగ్గ మరో విశేషం.  

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో... 
చదరంగంపై ఆసక్తితోనే చిన్న వయసులోనే ఎత్తుకు పైఎత్తులు వేయడం ప్రారంభించిన వైశాలిని తల్లిదండ్రులు రమేశ్‌బాబు, నాగలక్ష్మి ప్రోత్సహించి ప్రొఫెషనల్‌ చెస్‌ వైపు మళ్లించారు. ఆ తర్వాత వరుస విజయాలతో ఆమె దూసుకుపోయింది. వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌లో వైశాలి అండర్‌–12, అండర్‌–14 విభాగాల్లో విజేతగా నిలిచింది. 2020 చెస్‌ ఒలింపియాడ్‌లో తొలిసారి స్వర్ణపతకం గెలిచిన భారత జట్టులో వైశాలి సభ్యురాలిగా ఉంది.

2018లో ఆమె ఉమన్‌ గ్రాండ్‌మాస్టర్‌ హోదాను అందుకుంది. ఆ తర్వాత 2019 ఎక్స్‌ట్రాకాన్‌ ఓపెన్‌లో తొలి జీఎం నార్మ్, 2022లో ఫిషర్‌ మెమోరియల్‌ టోరీ్నలో రెండో జీఎం నార్మ్‌ సాధించిన వైశాలి ఈ ఏడాది ఖతర్‌ మాస్టర్స్‌లో మూడో జీఎం నార్మ్‌ను సొంతం చేసుకుంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌కు క్వాలిఫయింగ్‌గా పరిగణించే క్యాండిడేట్స్‌ టోర్నీకి వైశాలి అర్హత సాధించింది. పురుషుల విభాగంలో ఇదే టోర్నీకి ప్రజ్ఞానంద కూడా క్వాలిఫై అయ్యాడు.

దాంతో ‘క్యాండిడేట్స్‌’ బరిలో నిలిచిన తొలి సోదర, సోదరి జోడీగా కూడా వీరు గుర్తింపు దక్కించుకున్నారు. భారత్‌నుంచి గ్రాండ్‌మాస్టర్‌ హోదా అందుకున్న తొలి మహిళగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి (2002లో) గుర్తింపు పొందగా...2011లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ద్రోణవల్లి హారిక కూడా ఈ హోదాను సాధించింది. చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ఈ సందర్భంగా వైశాలికి అభినందనలు తెలియజేశాడు.

#

Tags : 1

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు