Breaking News

విధ్వం​స​కర సెంచరీ.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో! వీడియో వైరల్

Published on Mon, 03/04/2024 - 09:18

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2024లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. తాజాగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముల్తాన్‌ ఘన విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. 

కరాచీ బ్యాటర్లలో షోయబ్‌ మాలిక్‌(38) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు షాన్‌ మసూద్‌(36) పరుగులతో రాణించాడు. ముల్తాన్‌ సుల్తాన్స్‌ బౌలర్లలో ఉసమా మీర్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్‌ విల్లీ, మహ్మద్‌ అలీ, క్రిస్‌ జోర్డాన్‌, కుష్‌దుల్‌ షా తలా ఒక్క వికెట్‌ సాధించారు. 

ఉస్మాన్‌ ఖాన్‌ విధ్వంసకర సెంచరీ..
అంతకముందు బ్యాటింగ్‌ చేసిన ముల్తాన్‌ సుల్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ముల్తాన్‌ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కరాచీ బౌలర్లను ఉస్మాన్‌ ఖాన్‌ ఊచకోత కోశాడు.

కేవలం 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(58) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఇక ఈ విజయంతో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ముల్తాన్‌ సుల్తాన్‌ ఖారారు చేసుకుంది.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)