Breaking News

'వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్‌లో  స్నాక్స్ అమ్మేవాడిని! ఎన్నో కష్టాలు'

Published on Tue, 10/03/2023 - 10:22

హారీస్‌ రవూఫ్‌.. ప్రస్తుత పాకిస్తాన్‌ స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడు. తన పేస్‌ బౌలింగ్‌తో ప్యత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలిగే సత్తా ఉన్న స్పీడ్‌ స్టార్‌. 2020లో పాకిస్తాన్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రవూఫ్‌.. వరల్డ్‌ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే రవూఫ్‌ ఈ స్ధాయికి ఎదగడం వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. చదువుకునే రోజుల్లో కనీసం ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బులు లేకపోయేవి అంట. ఈ విషయాలను అతడే స్వయంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

"పదో తరగతి తర్వాత నేను ఇంటర్మీడియట్‌లో చేరాను. కానీ మా కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. ఫీజు‌ కట్టడానికి కూడా ఇబ్బంది పడేవాళ్లు. దీంతో నా ఫీజు చెల్లించడానికి  ప్రతీ ఆదివారం మార్కెట్‌లో  స్నాక్స్ అమ్మేవాడిని. వారంలో మిగిలిన రోజుల్లో క్లాస్‌లకు హాజరయ్యేవాడిని. ఆ తర్వాత నేను యూనివర్శిటీలో జాయిన్‌ అయ్యాను. అక్కడ ఫీజులు చాలా ఎక్కువగా ఉండేవి.

మా నాన్నతో పాటు నేను కూడా ఆ ఫీజులను భరించలేకపోయాను. ఈ సమయంలో టేప్‌ బాల్‌ క్రికెట్‌ ఆడటం ప్రారంభించాను.  నాకు బాగా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులతో యూనివర్శిటీ ఫీజు కట్టేవాడిని. పాకిస్తాన్‌లో టేప్-బాల్ క్రికెట్‌ ఆడే ఆటగాళ్లు బాగా సంపాదిస్తారు. నెలకు దాదాపు 2 నుంచి 3 లక్షలవరకు సంపాదించవచ్చు.

నేను నా ఫీజు కట్టగా.. మిగిలిన డబ్బులను మా అమ్మకు ఇచ్చేవాడిని. నేను ఈ స్ధాయికి చేరుకోవడం వెనక మా అమ్మనాన్న కష్టం కూడా ఉంది. మాది ఉమ్మడి కుటంబం. మొత్తం మా నాన్నకు నలుగురు అన్నదమ్ములు. అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. దీంతో చోటు సరిపోక కొన్ని రోజుల పాటు వంటగదిలో నిద్రపోయేవాళ్లం. నా చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించాను”అని ఈఎస్పీఎన్‌ క్రిక్‌ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవూఫ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: IND vs NEP: 23 పరుగుల తేడాతో ఘన విజయం.. సెమీస్‌కు చేరిన టీమిండియా

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)