Breaking News

వేలంలో ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.. ఆ క‌సి అక్క‌డ చూపించేశాడు!

Published on Fri, 11/29/2024 - 18:38

అబుదాబి టీ20 లీగ్‌-2024లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయ‌ర్ జానీ బెయిస్టో విధ్వంసం సృష్టించాడు. ఈ ధానాధన్ లీగ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిథ్యం వహిస్తున్న బెయిర్ స్టో.. శుక్రవారం మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ప్రత్యర్ధి బౌలర్లను ఈ ఇంగ్లీష్‌​ క్రికెటర్ ఊచకోత కోశాడు. కేవలం 30 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో టీమ్ అబుదాబి కేవలం మూడు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 

ఆఖరి ఓవర్‌లో తమ విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. అబుదాబి కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. చివరి నాలుగు బంతుల్లో జానీ నాన్‌స్ట్రైక్‌లో ఉండక‌పోవడంతో అబుదాబి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 

110 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమ్ అబుదాబి .. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 106 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన మోరిస్విల్లే సాంప్ ఆర్మీ 9.4 ఓవ‌ర్ల‌లో 109 ప‌రుగులకే కుప్ప‌కూలింది.

వేలంలో అమ్ముడుపోని జానీ..
ఇక మ్యాచ్‌లో దుమ్ము లేపిన జానీ బెయిర్ స్టో.. ఐపీఎల్‌-2025 వేలంలో మాత్రం అమ్ముడుపోలేదు. రూ. 2 కోట్ల క‌నీస ధ‌రతో వేలంలోకి వ‌చ్చిన అత‌డిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. గ‌తంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, పంజాబ్ కింగ్స్‌ల‌కు బెయిర్‌స్టో ప్రాతినిథ్యం వ‌హించాడు.
చదవండి: Asia Cup 2024: రేపే భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌.. లైవ్ ఎక్క‌డో తెలుసా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)