Breaking News

అల్‌కరాజ్‌ అనూహ్య పరాజయం

Published on Sun, 08/18/2024 - 04:10

సిన్సినాటి: నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో స్పెయిన్‌ సంచలనంగా మారిన కార్లొస్‌ అల్‌కరాజ్‌ సిన్సినాటి ఓపెన్‌లో ఓడిపోవడాన్ని ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయాడు. దీంతో కోర్టులోనే ఈ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ తన రాకెట్‌ను విరగ్గొట్టేశాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో రెండో సీడ్‌ అల్‌కరాజ్‌ 6–4, 6–7 (5/7), 4–6తో గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. గురువారం అర్ధరాత్రి జరగాల్సిన ఈ మ్యాచ్‌ వర్షం వల్ల ఆగిపోయింది. 

తొలి సెట్‌ గెలుపొందగా, రెండో సెట్‌ టైబ్రేక్‌కు దారితీసింది. ఈ దశలో మ్యాచ్‌ ఆగిపోగా మరుసటి రోజు టైబ్రేక్‌లో పుంజుకొని మ్యాచ్‌ను వరుస సెట్లలోనే ముగించవచ్చని అల్‌కరాజ్‌ భావించాడు. కానీ 37 ఏళ్ల వెటరన్‌ మోన్‌ఫిల్స్‌ పట్టుదలగా ఆడటంతో రెండో సెట్‌ అతని వశమైంది. 

అదే జోరుతో ఆఖరి సెట్‌నూ నెగ్గిన మోన్‌ఫిల్స్‌ మ్యాచ్‌ గెలుపొందాడు. దీంతో తన ప్రదర్శన, మ్యాచ్‌ ఫలితంతో నిరాశచెందిన స్పెయిన్‌ స్టార్‌ రాకెట్‌ బద్దలుకొట్టాడు. తన కెరీర్‌లోనే ఇదో చెత్తమ్యాచ్‌ అని, దీన్ని త్వరగా మర్చిపోయి యూఎస్‌ ఓపెన్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పాడు. న్యూయార్క్‌లో ఈ నెల 26 నుంచి యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ జరుగుతుంది.   
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)