ఉమేశ్‌ యాదవ్‌ వైల్డ్‌ రియాక్షన్‌ వెనుక కారణం అదేనా?

Published on Sat, 06/10/2023 - 16:40

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పోరాడుతోంది. ఆసీస్‌ ఇప్పటికే 330 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉండడంతో టీమిండియాకు ఓటమి ముప్పు పొంచే ఉంది. మరో గంటలో ముగిసే తొలి సెషన్‌లోపూ ఆసీస్‌ను ఆలౌట్‌ చేయకుంటే టీమిండియాకు పెను ప్రమాదం ఉంది. 400 పరుగులకు పైగా టార్గెట్‌ను నిర్దేశించే పనిలో ఉన్న ఆసీస్‌ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గ్రీన్‌ 25, అలెక్స్‌ కేరీ 22 పరుగులతో ఆడుతున్నారు.

ఈ విషయం పక్కనబెడితే.. నాలుగోరోజు ఆట మొదలైన కాసేపటికే ఉమేశ్‌ యాదవ్‌ బ్రేక్‌ ఇచ్చాడు. 41 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్నస్‌ లబుషేన్‌ను తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయిన బంతి లబుషేన్‌ బ్యాట్‌కు తగులుతూ నేరుగా పుజారా చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ కోల్పోయింది. అయితే లబుషేన్‌ ఔట్‌ చేసిన ఆనందంలో ఉమేశ్‌ యాదవ్‌ గట్టిగా అరుస్తూ కాస్త వైల్డ్‌గా రియాక్ట్‌ అయ్యాడు.

అయితే ఉమేశ్‌ ఇలా చేయడం వెనుక ఒక కారణముందని అభిమానులు భావిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఉమేశ్‌ యాదవ్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేదు.. పైగా దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఉమేశ్‌ ఇవేవి పట్టించుకోకుండా కేవలం తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మంచి బౌలింగ్‌ ప్రదర్శన కనబరుస్తున్న ఉమేశ్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియారిటీ ఎప్పటికైనా పనికొచ్చేది కాని వ్యర్థం కాదు అని నిరూపించాడు. అందుకే లబుషేన్‌ వికెట్‌ తీయగానే అంత వైల్డ్‌గా రియాక్ట్‌ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: 'గాయాన్ని సైతం లెక్క చేయని మీ పోరాటం అసమానం'

Videos

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

Magazine Story About ChandraBabu Cunning Plans

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)