ఉగాండ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌

Published on Thu, 04/25/2024 - 15:54

ఉగాండ జాతీయ పురుషుల క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా భారత మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ అభయ్‌ శర్మ నియమించబడ్డాడు. ఈ విషయాన్ని ఉగాండ క్రికెట్‌ అసోసియేషన్‌ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 54 ఏళ్ల అభయ్‌ శర్మ ఉగాండ క్రికెట్‌ జట్టుతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూసీఏ పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తమ జట్టుకు అభయ్‌ అనుభవం, క్రికెట్‌ పరిజ్ఞానం మేలు చేకూరుస్తుందని ఉగాండ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. 

కాగా, ఉగాండ క్రికెట్‌ జట్టు పొట్టి ప్రపంచకప్‌కు తొలిసారి అర్హత సాధించింది. జూన్ 1 నుండి యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌ 2024లో ఉగాండ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మెగా టోర్నీకి క్వాలిఫై అయిన 20 జట్లలో ఉగాండ ఒకటి. గతేడాది కాలంలో ఆట పరంగా చాలా మెరుగుపడిన ఉగాండ.. వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో అద్భుత విజయాలు సాధించింది. రాబోయే వరల్డ్‌కప్‌లో ఉగాండ గ్రూప్‌-సిలో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్తాన్‌ లాంటి మేటీ జట్లతో పోటీ పడనుంది. ఉగాండ ఉండే గ్రూప్‌లో మరో పసికూన (పపువా న్యూ గినియా) కూడా ఉంది.

అభయ్‌ శర్మ విషయానికొస్తే.. ఈ మాజీ ఢిల్లీ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోయినప్పటికీ, దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటాడు. అభయ్‌ ఢిల్లీతో పాటు రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అభయ్‌ తన కెరీర్‌లో 89 ఫస్ట్‌క్లాస్‌  మ్యాచ్‌లు, 40 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో దాదాపు 5000 పరుగులు చేసి 230 వరకు వికెట్లు పడగొట్టడంలో భాగమయ్యాడు. అభయ్‌ తన కెరీర్‌లో 9 శతకాలు, 21 అర్దశతకాలు సాధించాడు. ఆటగాడిగా కెరీర్‌కు వీడ్కోలు పలికాక అభయ్‌ కోచింగ్‌ బాధ్యతల్లోకి వచ్చాడు. అభయ్‌.. భారత-ఏ, భారత అండర్‌-19 జట్టు, ఢిల్లీ రంజీ జట్టు, భారత మహిళా క్రికెట్‌ జట్లకు కోచింగ్‌ అందించాడు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)