Breaking News

చాంపియన్స్‌ సాహితి, శ్రీకాంత్‌

Published on Sat, 12/20/2025 - 03:31

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు నిర్వహించిన యూబీఎస్‌ అథ్లెటిక్స్‌ కిడ్స్‌ కప్‌ విజయవంతంగా ముగిసింది. జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్‌ స్టేడియంలో నిర్వహించిన ఈ టోర్నీలో...  7 నుంచి 15 ఏళ్ల విభాగాల్లో వేర్వేరుగా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ పోటీలు నిర్వహించారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో నిర్వహించిన ప్రాథమిక రౌండ్‌లలో సత్తాచాటిన 500 మంది అథ్లెట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. 

బాలికల అండర్‌–15 విభాగంలో సత్యం ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన వర్ష ప్రథమ బహుమతి దక్కించుకోగా... సాహితి (ఎంఎన్‌ఆర్‌ హై స్కూల్‌), పర్విన్‌ జేబా (అంబర్‌పేట్‌ గవర్నమెంట్‌ హై స్కూల్‌) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. బాలికల అండర్‌–14 విభాగంలో నాగార్జున గ్రామర్‌ హై స్కూల్‌కు చెందిన శ్రీజెనా మొదటి స్థానం దక్కించుకోగా... ప్రణవి (శ్లోక స్కూల్‌), భువనేశ్వరి (కృష్ణవేణి ట్యాలెంట్‌ స్కూల్‌) రెండో, మూడో బహుమతులు దక్కించుకున్నారు. 

బాలుర అండర్‌–15 విభాగంలో గంగోత్రి పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన శ్రీకాంత్‌ అగ్రస్థానంలో నిలవగా... సమీర్‌ హుసేన్‌ (బ్రైట్‌ కాన్సెప్ట్‌ హైస్కూల్‌), రాహుల్‌ శెట్టి (గౌతమి టెక్నో స్కూల్‌) వరుసగా ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. 

అండర్‌–14 విభాగంలో పల్లవి మోడల్‌ స్కూల్‌కు చెందిన హర్షిత్‌ మొదటి స్థానం దక్కించుకోగా... మొహమ్మద్‌ అయాన్‌ ఖాన్‌ (పల్లవి మోడల్‌ స్కూల్‌), సూరజ్‌ కుమార్‌ (సెయింట్‌ థామస్‌ హై స్కూల్‌) వరుసగా రెండో, మూడో బహుమతులు దక్కించుకున్నారు. విజేతలకు రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు, క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనా రెడ్డి శుక్రవారం బహుమతులు ప్రదానం చేశారు.  

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)