Breaking News

IPL 2025: ఆ యువ ఆటగాడి విషయంలో సీఎస్‌కే తప్పు చేసిందా..?

Published on Wed, 12/04/2024 - 17:25

ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి ముందు ముంబై యువ ఆటగాడు ఆయుశ్‌ మాత్రే పేరు క్రికెట్‌ సర్కిల్స్‌లో బాగా నానింది. మాత్రే టాలెంట్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోని ముగ్దుడయ్యాడని బాగా ప్రచారం జరిగింది. మెగా వేలానికి ముందు సీఎస్‌కే మాత్రేను ట్రయిల్స్‌కు కూడా పిలిచిందని సోషల్‌మీడియా కోడై కూసింది. అయితే చివరకు మాత్రేను మెగా వేలంలో సీఎస్‌కే కాని మరే ఇతర ఫ్రాంచైజీ కాని పట్టించుకోలేదు. ఈ 17 ఏళ్ల రైట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ వేలంలో అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయాడు.

ఇదంతా సరే, ఇప్పుడు మాత్రే ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా..? సీఎస్‌కే ఆశ చూపించి పట్టించుకోకుండా వదిలిపెట్టిన మాత్రే, ప్రస్తుతం జరుగుతున్న అండర్‌-19 ఆసియా కప్‌లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో మాత్రే ఇప్పటికే రెండు హాఫ్‌ సెంచరీలు చేసి 3 వికెట్లు తీశాడు. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మాత్రే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (67 నాటౌట్‌; 1/19) ఇరగదీశాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

మాత్రే తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఇతన్ని ఎందుకు వదులుకున్నామా అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ భావిస్తుండవచ్చు. మాత్రే వద్ద బంతిని బలంగా బాదే సామర్థ్యం ఉండటంతో పాటు మాంచి బ్యాటింగ్‌ టెక్నిక్‌ కూడా ఉంది. ఇతను సీఎస్‌కేలో ఉంటే ఓపెనర్‌గా అద్భుతాలు చేసే ఆస్కారం ఉండేది. ఏది ఏమైనా సీఎస్‌కే మాత్రేను దక్కించుకోలేకపోవడం అన్‌ లక్కీనే అని చెప్పాలి. 

మరోవైపు మాత్రే సహచరుడు, ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌ వైభవ్‌ సూర్యవంశీని ఐపీఎల్‌ మెగా వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. సూర్యవంశీని ఆర్‌ఆర్‌ 1.1 కోట్లకు సొంతం చేసుకుంది.

ఐపీఎల్‌ 2025 మెగా వేలం​లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా (13) సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. మాత్రేలానే సూర్యవంశీ కూడా మంచి హిట్టర్‌. ఇంకా చెప్పాలంటే మాత్రే కంటే బలమైన హిట్టర్‌. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ మాత్రేతో కలిసి ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. సూర్యవంశీ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌తో పాటు స్లో లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలింగ్‌ వేస్తాడు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)