Breaking News

సంజయ్‌ సారథ్యంలో...

Published on Wed, 07/02/2025 - 08:02

న్యూఢిల్లీ: ప్రొ హాకీ లీగ్‌ యూరప్‌ అంచె పోటీల్లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో... హాకీ ఇండియా (హెచ్‌ఐ) దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. యువ ఆటగాళ్లకు యూరప్‌లో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ దక్కాలనే ఉద్దేశంతో... భారత ‘ఎ’ జట్టును యూరప్‌ పర్యటనకు పంపుతోంది. దీని కోసం మంగళవారం 20 మంది యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ పర్యటనలో భాగంగా  ఈ నెల 8 నుంచి 20 మధ్య ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్‌ జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనున్న భారత ‘ఎ’ జట్టు... ఇంగ్లండ్, బెల్జియంతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ‘నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ టూర్‌ ఉపయోగపడుతుంది. 

ప్రతిభగల ప్లేయర్లను గుర్తించడంతో పాటు వారికి అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ పరిస్థితులు కలి్పంచేందుకు ఇది తోడ్పడుతుంది’అని హాకీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. భారత ‘ఎ’ జట్టుకు సంజయ్‌ సారథ్యం వహిస్తుండగా... రబిచంద్రసింగ్‌ వైస్‌ కెపె్టన్‌గా వ్యవహరించనున్నాడు. భారత జాతీయ జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేస్తున్న శివేంద్ర సింగ్‌... ఈ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ‘యూరప్‌ ఆటగాళ్ల శైలిని అర్థం చేసుకునేందుకు మన యువ ఆటగాళ్లకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ముందే అంతర్జాతీయ అనుభవం గడించడం ఆటగాళ్లకు ఎంతో తోడ్పడుతుంది’ అని శివేంద్ర సింగ్‌ అన్నాడు. దీంతో జాతీయ జట్టు భవిష్యత్తుకు భరోసా పెరుగుతుందని వెల్లడించాడు.  

భారత ‘ఎ’ హాకీ జట్టు: గోల్‌ కీపర్స్‌: పవన్, మోహిత్‌. డిఫెండర్స్‌: ప్రతాప్‌ లాక్రా, వరుణ్‌ కుమార్, అమన్‌దీప్‌ లాక్రా, ప్రమోద్, సంజయ్‌ (కెప్టెన్‌). మిడ్‌ఫీల్డర్స్‌: పూవన్న చందూర బాబీ, మొహమ్మద్‌ రాహిల్, రబిచంద్ర సింగ్, విష్ణుకాంత్‌ సింగ్, ప్రదీప్‌ సింగ్, రాజిందర్‌ సింగ్‌. ఫార్వర్డ్స్‌: అంగద్‌బీర్‌ సింగ్, బాబీ సింగ్‌ ధామి, మణీందర్‌ సింగ్, వెంకటేశ్‌ కెంచె, ఆదిత్య అర్జున్‌ లాథె, సెల్వమ్‌ కార్తీ, ఉత్తమ్‌ సింగ్‌. స్టాండ్‌బై: అంకిత్‌ (గోల్‌కీపర్‌), సునీల్‌ (డిఫెండర్‌), సుదీప్‌ (ఫార్వర్డ్‌).   

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)