Breaking News

భారత టీటీ జట్లకు రెండు పతకాలు

Published on Thu, 11/27/2025 - 03:21

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు రెండు పతకాలు సాధించాయి. రొమేనియా వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత బాలుర అండర్‌–19 జట్టు రజత పతకంతో మెరవగా... బాలికల అండర్‌–15 జట్టు కాంస్యం సాధించింది. చక్కటి ఆటతీరుతో ఫైనల్‌కు చేరుకున్న బాలుర అండర్‌–19 జట్టు బుధవారం జరిగిన ఫైనల్లో 0–3తో జపాన్‌ చేతిలో ఓడింది.

అంకుర్‌ 17–15, 6–11, 12–10, 4–11, 11–13తో రైసీ కవాకమి (జపాన్‌) చేతిలో పోరాడి ఓడగా... అభినందర్‌ 7–11, 8–11, 6–11తో కజకి యోషియామా (జపాన్‌) చేతిలో ఓడాడు. మూడో సింగిల్స్‌ మ్యాచ్‌లో ప్రియానుజ్‌ భట్టాచార్య 9–11, 7–11, 3–11తో టమిటో వటనబే (జపాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. 

అంతకుముందు సెమీస్‌లో భారత జట్టు 3–2తో చైనీస్‌ తైపీపై విజయం సాధించింది. బాలికల అండర్‌–15 జట్టు సెమీఫైనల్లో 0–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. తొలిసారి ఈ టోర్నీ బరిలోకి దిగిన భారత అమ్మాయిల అండర్‌–15 జట్టు క్వార్టర్స్‌లో 3–1తో జర్మనీపై గెలిచింది. బాలికల అండర్‌–19 క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 2–3తో చైనీస్‌ తైపీ చేతిలో ఓడింది.  

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)