Breaking News

పసిడి పోరుకు సాకేత్‌–రామ్‌ జోడీ

Published on Fri, 09/29/2023 - 05:17

ఆసియా క్రీడల టెన్నిస్‌ ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణ పతకానికి విజయం దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ ద్వయం 6–1, 6–7 (6/8), 10–0తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సెంగ్‌చన్‌ హాంగ్‌–సూన్‌వూ క్వాన్‌ (దక్షిణ కొరియా)పై గెలిచింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్‌ 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో సనమ్‌ సింగ్‌తో కలిసి రజత పతకం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి స్వర్ణ పతకం సాధించాడు. నేడు ఉదయం గం. 7:30 నుంచి జరిగే ఫైనల్లో జేసన్‌  జంగ్‌–యు సియో సు (చైనీస్‌ తైపీ) జంటతో సాకేత్‌–రామ్‌ జోడీ తలపడుతుంది. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్న–రుతుజా భోస్లే (భారత్‌) ద్వయం సెమీఫైనల్‌ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–రుతుజా 7–5, 6–3తో జిబెక్‌ కులామ్‌బయేవా–గ్రిగోరి లొమాకిన్‌ (కజకిస్తాన్‌)లపై గెలిచారు. నేడు జరిగ సెమీఫైనల్లో యు సియో సు–చాన్‌ హావో చింగ్‌ (చైనీస్‌ తైపీ)లతో బోపన్న–రుతుజా తలపడతారు.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)