Breaking News

ఉసేన్‌ బోల్ట్‌కు ఏమాత్రం తీసిపోని రోబో.. 100 మీటర్ల రేస్‌లో గిన్నిస్‌ రికార్డు

Published on Fri, 03/01/2024 - 13:46

కాస్సీ అనే రోబో 100 మీటర్ల పరుగు పందెంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ రేస్‌ను 24.73 సెకెన్లలో ముగించిన కాస్సీ.. అత్యంత వేగంగా పరుగు పూర్తి చేసిన రెండు కాళ్ల రోబోగా గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కింది. మనుషుల వేగంతో పోల్చుకుంటే కాస్సీ వేగం తక్కువే అయినప్పటికీ.. ఓ రోబో నుంచి ఇది ఆశ్చర్యకరమైన ప్రదర్శనే అని చెప్పాలి. గతంలో ఏ రోబో ఇంత వేగంగా 100 మీటర్ల పరుగు పందెన్ని పూర్తి చేయలేదు.

కాస్సీ ప్రదర్శన దాని రూపకర్తలకు సైతం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. మున్ముందు కాస్సీ మరిన్ని అద్భుతాలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. పరుగులో మరింత వేగాన్ని అందుకోవడం కాస్సీకి కష్టతరమైన సవాలు కాదని వారంటున్నారు. అసలైన సవాలు పరుగు మొదలుపెట్టడం, ఆపడమేనని తెలిపారు. 

కాస్సీని ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలోని ఇంజనీర్లు సృష్టించారు. ఇది వారి  ఎజిలిటీ రోబోటిక్స్ విభాగంచే తయారు చేయబడింది. కాస్సీ యొక్క మోకాళ్లు ఉష్ట్రపక్షి (Ostrich) నుండి ప్రేరణ పొందాయి. ఉష్ట్రపక్షి భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి. దీన్ని ప్రేరణగా తీసుకునే కాస్సీని తయారు చేశారు. 

కాగా, కాస్సీ దిగ్గజ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌కు ఏమాత్రం తీసిపోదని నెటిజన్లు అంటున్నారు. బోల్ట్‌కు కాస్సీకి వ్యత్యాసం 15 సెకెన్లు మాత్రమే. బోల్ట్‌ 9.58 సెకెన్లలో 100మీ రేస్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మహిళల విభాగంలో 100మీ ప్రపంచ రికార్డు ఫారెన్స్‌ గ్రిఫిత్‌ పేరిట ఉంది. ఈమె 10.49 సెకెన్లలో 100మీ రేసును పూర్తి చేసింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)