Breaking News

స్టబ్స్‌ విధ్వంసర సెంచరీ.. సౌతాఫ్రికా చేతిలో ఐర్లాండ్‌ చిత్తు

Published on Sat, 10/05/2024 - 16:33

అబుదాబి వేదిక‌గా ఐర్లాండ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో 174 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మ‌రో మ్యాచ్ మిగిలూండ‌గానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో ప్రోటీస్ సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 344 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్‌.. స‌ఫారీ బౌల‌ర్ల దాటికి కేవ‌లం 169 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 

ప్రోటీస్ పేస‌ర్ లిజార్డ్ విలియ‌మ్స్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఎంగిడీ, జార్న్ ఫోర్టుయిన్ త‌లా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ముల్డ‌ర్‌, ఆండిలే ఫెహ్లుక్వాయో, బార్ట‌మ‌న్ చెరో వికెట్ ప‌డగొట్టారు. ఐరీష్ బ్యాట‌ర్ల‌లో క్రెయిగ్  యంగ్‌(29) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

సెంచ‌రీతో చెల‌రేగిన స్ట‌బ్స్‌..
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 343 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో యువ ఆట‌గాడు ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 81 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 112 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 

స్ట‌బ్స్‌కు ఇదే తొలి అంత‌ర్జాతీయ సెంచ‌రీ కావ‌డం విశేషం. స్ట‌బ్స్‌తో పాటు వెర్న‌య‌నే(67), ముల్డ‌ర్‌(43) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో యంగ్‌, కాంఫ్‌హ‌ర్‌, హోయ్ త‌లా వికెట్ సాధించారు. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య ఆఖ‌రి వ‌న్డే ఆక్టోబ‌ర్ 7న అబుదాబి వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.
చదవండి: T20 WC: న్యూజిలాండ్‌ చేతిలో ఘోర ఓట‌మి.. భార‌త్ సెమీస్‌ చేరాలంటే?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)